ప్రజాశక్తి-రైల్వేకోడూరు : రైల్వేకోడూరు తాలూకా ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా కి ఓబులేసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక ఎన్జీవో హోం నందు ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు, కార్యదర్శి డి రవికుమార్ కోశాధికారి ఎన్నికల పరిశీలకులు నిత్యపూజయ్య పర్యవేక్షణలో కోడూరు తాలూకా అధ్యక్షుడిగా ఓబులేసులు కో ఆప్షన్ ద్వారా నియమించుటకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. కార్యదర్శిగా రవీంద్ర వర్మను నియమించారు. ఈ సందర్భంగా ఓబులేష్ మాట్లాడుతూ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసులు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కే శివారెడ్డి జిల్లా, రాష్ట్ర నాయకత్వంతో కలిసిఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శి విజయ్ కుమార్, కోశాధికారి అస్లాం, అసోసియేట్ ప్రెసిడెంట్ రవి కుమార్, ఉపాధ్యక్షులు గౌరీ శంకర్, ఉషారాణి, సతీష్ రెడ్డి, అనసూయ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.










