Jul 05,2023 21:36
  • బ్రిటన్‌ ప్రజల మనోగతం

లండన్‌ : బ్రిటన్‌లో నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) ప్రారంభించి బుధవారానికి 75ఏళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో దీని మనుగడపై అనేక సందేహాలు, ప్రశులు తలెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్‌హెచ్‌ఎస్‌ వ్యవస్థాపకుడు నయే బెవన్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోనున్నాయి. ''ప్రజలకు దీనిపై విశ్వాసం వునుంత కాలమూ ఇది మనుగడలో వుంటుంది. దానికోసం పోరాటం చేయాల్సిన అవసరమూ వుంటుంది.'' అన్నది ఆ వ్యాఖ్యల సారాంశం. ఈనాడు ఎన్‌హెచ్‌ఎస్‌ తీవ్ర సంక్షోభంలో వుంది. వైద్యం నిరీక్షిస్తున్న రోగుల జాబితా లక్షల సంఖ్యలో వుంది. వారికి చికిత్సల్లో జరుగుతున్న జాప్యానికి సర్వత్రా ఖండనలు ఎదురవతున్నాయి. ఇలా చికిత్సల్లో జాప్యం జరగడం అన్ని సార్లు బాధాకరంగా వుంటుంది. మరికొనిు సార్లు ప్రమాదకరంగా మారుతోంది. ఆస్పత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. బయట అంబులెన్సులు క్యూ కడుతున్నాయి. రోగులను డిశ్చార్జ్‌ చేయడానికి కూడా గంటలు వేచి వుండాల్సి వస్తోంది. వైద్యానికయ్యే వ్యయానిు భరించేవారు ప్రైవేట్‌ ఆస్పత్రులకువెళతారు. లేనివారు ఇలా వైద్యం కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో 2019 నుండి ఇలా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సల కోసం వెళుతున్న వారి సంఖ్య దాదాపు మూడో వంతు పెరిగింది. దీంతో ప్రైవేటు రంగంలో శిక్షణ పొందిన మెడికల్‌ వర్కర్లకు డిమాండ్‌ పెరిగింది. మరోవైపు ఎన్‌హెచ్‌ఎస్‌లో ఇప్పటికే లక్షకుపైగా ఖాళీలు వున్నాయి. ఎవరు డబ్బు చెల్లించగలరో వారికే త్వరగా చికిత్స అందుతోంది. మరోవైపు పేదలకు చికిత్సనందించడం కోసం పనిచేయాల్సిన సార్వజనీన ఆరోగ్య సర్వీసు సేవలు కుదించుకుపోతున్నాయి. వీటికి సమగ్రంగా నిధులు అందడం లేదు. అవసరమైనంతగా పెట్టుబడులు పెట్టకపోవడం, ప్రైవేటీకరణ అనేవి ఎన్‌హెచ్‌ఎస్‌ క్షీణించడానికి ప్రధానమైన రెండు కారణాలుగా వున్నాయి. ఎన్‌హెచ్‌ఎస్‌ అనేది వ్యయభరితమైన, కాలదోషం పట్టిన అంశంగా టోరీ, లేబర్‌ పార్టీల నాయకులు భావిస్తున్నారు. సాధారణంగా ఎన్‌హెచ్‌ఎస్‌ను దాని సాంప్రదాయ రూపంలో అమలు చేయడం భరించలేనిదిగా మారిందను ఆలోచన నేతల్లో నెలకొంది. దీనికి ప్రధాన కారణం సమాజంలో పెరుగుతున్న వృద్ధులు. వీరికయ్యే వ్యయం అధికంగా, సుదీర్ఘకాలం కొనసాగడమే. ఇటువంటి పరిస్థితుల్లో, తాజాగా బ్రిటన్‌ వైద్య వ్యవస్థలో కనివినీ ఎరుగనిరీతిలో సమ్మెలు, ఆందోళనలు, నిరసనలు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత ఏకైక ఆశాకిరణం ప్రజలకు ఈ వ్యవస్థపై నమ్మకం వునుంత కాలమూ దీని కోసం పోరాటం జరపడమేనని తెలిపారు.