May 28,2023 08:09
  • లోక్‌సభ స్పీకర్‌ ఛాంబర్‌లో సెంగాల్‌ ప్రతిష్ఠ

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నూతన పార్లమెంట్‌ భవనం ప్రారంభోత్సవం ఆదివారం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించనున్నారు. పార్లమెంట్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసే పందిరిలో సంప్రదాయ పూజలు, హోమంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇందులో ప్రధానిమోడీ, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌సింగ్‌, మాజీ ప్రధానిహెచ్‌డి దేవగౌడ, సీనియర్‌ మంత్రులు పాల్గంటారు. పూజా కార్యక్రమాలు పూర్తికాగానే ఇందులో పాల్గనే ప్రముఖులంతా కలిసి లోక్‌సభ, రాజ్యసభ ప్రాంగణాలను వీక్షిస్తారు.
           ఉదయం ఏడింటికి హోమం జరుగుతుంది. ఆ తరువాత సర్వ మత ప్రార్థనలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల కల్లా తొలి విడత ప్రారంభోత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. అనంతరం హోమం వేదిక వద్దే తమిళనాడు తంజావూరు శైవ మఠ పెద్దలు చోళుల రాజదండమైన సెంగాల్‌ ప్రధానినరేంద్ర మోడీకి అందజేస్తారు. లోక్‌సభ ఛాంబర్‌లో స్పీకర్‌ కుర్చీ వద్ద రాజదండానిు (సెంగాల్‌) ప్రతిష్ఠిస్తారు. మధ్యాహుం రెండో విడత కార్యక్రమం మొదలవుతుంది. మధ్యాహు కార్యక్రమంలో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ ప్రసంగం ఉంటుంది. రాజ్యసభ చైర్మన్‌ జగ్‌దీప్‌ ధన్‌కర్‌ తరపున అభినందన సందేశానిు ఆయన చదివి వినిపిస్తారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లిఖితపూర్వక సందేశానిు కూడా ఇదే సందర్భంగా సభలో చదివి వినిపిస్తారు. ఈ సందర్భానిు పురస్కరించుకునిరూ.75 నాణేనిు, ఒక స్మారక తపాలా బిళ్లను ప్రధానమంత్రి విడుదల చేస్తారు. కార్యక్రమానిు ముగిస్తూ లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ 'ఓట్‌ ఆఫ్‌ థాంక్స్‌' చెబుతారు. ఈ కార్యక్రమంలో ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలతో పాటు వైసిపి, టిడిపి, ఎస్‌ఎడి, జెడిఎస్‌, బిఎస్‌పి తదితర పార్టీలు పాల్గంటాయి.
           రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖర్‌, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌లకుఆహ్వానం అందలేదు. ద్రౌపది ముర్ము, రామ్‌నాథ్‌ కోవింద్‌ గిరిజన, దళిత నేతలు అయినప్పటికీ ప్రభుత్వం చెబుతును ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి ఆహ్వానించలేదు. ద్రౌపది ముర్మును పార్లమెంట్‌ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ 20 ప్రతిపక్ష పార్టీలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించాయి.