ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల ఉన్న సీతం ఇంజనీరింగ్ కళాశాలలో 2(ఎ) బాలికల బెటాలియన్ ఎన్.సి.సి విజయనగరం, సుబేదార్ మేజర్ రామదాత్ మరియు జి.సి.ఐ సరిత ఆధ్వర్యంలో బాలికల ఎంపిక నిర్వహించడం జరిగింది. ఈ ఎంపికలో భాగంగా సీతం, సత్య డిగ్రీ విద్యా సంస్థల బాలికలు 150 మంది పాల్గొనగా పరుగు పందెం, ఎత్తు, బరువు, మౌఖిక పరీక్ష, చేతులు, కాళ్ల కదలికల పరిశీలన ఆధారంగా 50 మందిని ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ గోపేంద్ర, సుబేదార్ మేజర్ రామదాత్ మరియు జి.సి.ఐ సరిత పర్యవేక్షణలో జరిగింది. సుబేదార్ మేజర్ రామ్ దత్ మాట్లాడుతూ, ఎన్.సి.సి కోర్సును జేఎన్టీయూ జీవీ ఆర్23 రెగ్యులేషన్లో పెట్టడం జరిగింది. మీరందరూ ఈ ఎన్.సి.సిలో ఎంపికైనందుకు క్రెడిట్ పాయింట్స్ పొందుతారు అని విద్యార్థులకు చెప్పారు. ఎంపికైన బాలికలను సత్యా విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్. మజ్జి శశిభూషణ్ రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, డాక్టర్ సాయిదేవి మని, ఎన్.సి.సి ఆఫీసర్ కెప్టెన్ ఎన్. సత్యవేణి, లెఫ్ట్నెంట్ ఎం.వరలక్ష్మి, లెఫ్ట్నెంట్ ఎస్. ప్రశాంత్, సి. ఎస్.ఓ సత్యనారాయణ, పిడి మహేష్ పాల్గొన్నారు.










