జాతీయస్థాయి జయప్రద జమున అవార్డ్స్ 2022 ఫలితాలను ప్రకటించినట్లు డాక్టర్ పెల్లకూరు జయప్రద సోమిరెడ్డి తెలిపారు. నానీల విభాగంలో అమ్మ నానీల సంపుటి రచయిత పుచ్చకాయల బ్రహ్మాజీరావు, నవల విభాగంలో హీరో నవల ప్రభాకర్ జైన్ కి లభించింది. నానీల న్యాయ నిర్ణేతగా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వి వింధ్యావాసిని దేవి, నవలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్ వి.ఆర్. రాసాని, శిరంసెట్టి కాంతారావు మరియు సింహ ప్రసాద్ వ్యవహరించారు. అవార్డు గ్రహీతలకు ఈనెల 25వ తేదీ నెల్లూరులో పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో జరుగు అవార్డు ఫంక్షన్లో పురస్కారాలు అందజేయబడును.










