ప్రజాశక్తి-కలికిరి : కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచ్ రెడ్డివారి ప్రతాప్ కుమార్ రెడ్డి కుటుంబాన్ని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పరామర్శించారు. ఆదివారం ప్రతాప్ కుమార్ రెడ్డి తండ్రి రెడ్డివారి ద్వారకానాథ్ రెడ్డి అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే కలికిరి, రెడ్డివారి పల్లి లోని వారి ఇంటికి వెళ్లి ద్వారకనాథ్ రెడ్డి భౌతికకాయానికి ఘన నివాళులర్పించి ప్రతాప్ రెడ్డి అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెడ్డివారి కుటుంబంలో ఉన్నతమైన వ్యక్తిని కోల్పో వడం దురదృష్టకరమని ఈ బాధాకర సంఘటన నుండి సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా జీవితంలోకి వచ్చే విదంగా దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చంద్రకుమార్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రెడ్డి, సతీష్ రెడ్డి ఎర్రం రెడ్డి, అగస్తేశ్వర్ శ్రీనివాస్ వర్మ, మల్ రెడ్డి, వెంకట్ రెడ్డి మధు రెడ్డి, ప్రేమానంద్ రెడ్డి, తదితర టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.










