ప్రజాశక్తి-దేవరపల్లి : దేవరాపల్లి తహశీల్దార్ కార్యాలయంలో నిజాయితీగా పనిచేసే వారికి పనిలేదు జరిగితే బదిలీ లేదా డిప్యూటేషన్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ అధికారి పార్టీ పెద్దలు తీరు ఇదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పెర్కోన్నారు. బుధవారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు. రెండు నెలలు క్రితం అకస్మాత్తుగా RI శ్రీను వాసును బదిలీ చేయగా వారం రోజులు క్రితం డిప్యూటీ తహశీల్దార్ అరుణ్ చంద్రను డిప్యూటేషన్ పై బదిలీ చేసారు. ఇక్కడ గత కొంత కాలం నుండి డిప్యూటీ తహశీల్దార్ గా పని చేస్తు తహశీల్దార్ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండడంతో పాటు ఎవరికి చిన్న సమస్యలు వచ్చిన వాటి పరిష్కారానికి ఎనలేని కృషి చేసారు. సాదరణ వ్యక్తులకు అందుబాటులో ఉండటం ఎటువంటి భూసమస్యనైన కౌన్సెలింగ్ చేసి పరిష్కారం చేసేవారు. దీంతో పాటు భూసమగ్ర సర్వే లో కీలక పాత్ర పోషించారు. విది నిర్వహణలో ఓక్కరూపాయి ఆశించకుండా పని చేసిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి డిప్యూటీ తహశీల్దార్ అటువంటి వ్యక్తిని అకస్మాత్తుగా కలెక్టరేట్ కు డిప్యూటేషన్ పై బదిలీ చేసి ప్రజలకు నిజాయితీ గల అధికారిని దూరం చేసిన అదికార పార్టీ పెద్దలకు ప్రజలు గునపాఠం చెప్పె రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు స్వస్తి పలికి వెంటనే డిప్యూటీ తహశీల్దార్ అరుణ్ చంద్ర డిప్యూటేషన్ ను రద్దు చేసి అధికార పార్టీ పెద్దలు నిజాయితీని నిరూపించుకోవాలని వెంకన్న డిమాండ్ చేసారు,










