Oct 29,2020 00:31

మాట్లాడుతున్న కోటేశ్వరరావు

కశింకోట : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యజమానులకు అనుకూలంగా చట్టాలు చేస్తున్నా యని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. కొత్తపల్లి క్రెబ్స్‌ కార్మికులు సమ్మె బుధవారమూ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడీ సర్కారు కార్మిక చట్టాలను కుదించడంతో తీవ్ర నష్టం కలుగనుందని తెలిపారు. ఐక్యపోరాటాలతో కార్మిక వ్యతిరేక చర్యలను తిప్పికొడతామన్నారు. క్రెబ్స్‌ కార్మికులకు కంపెనీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎ.బాలకష్ణ మాట్లాడుతూ కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అరిగా వెంకట అప్పారావు, కాలెపు ఈశ్వర అప్పారావు, అద్దిపల్లి బాబూరావు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు