- కెంపే గౌడ ఆశయాలను నేరవేరుద్దాం
- నియోజకవర్గ మొరుసుకాపు రెడ్ల విజ్ఞప్తి
ప్రజాశక్తి - బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట నగర పంచాయతీలో ఈనెల 27వ తేదీ (మంగళవారం) ఆనాటి విజయనగర సామ్రాజ్య సామంత రాజు, బెంగళూరు మహానగర నిర్మాత, దీశాలి, ధైర్యశాలి అయినా మొరుసు కాపు (వక్కలిగ) చెందిన కెంపే గౌడ 514వ జయంతి వేడుకలను తంబళ్లపల్లి నియోజకవర్గం మొరుసు కాపు రెడ్డి (వక్కలిగ గౌడ) సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని,ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని ప్రతి మొరుసు కాపు కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని నియోజకవర్గ మొరుసుకాపు సంఘ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ 27వ తేది 6వ నెల 1510వ సంవత్సరంలో జన్మించిన మొరుసుకాపు రెడ్డి (వక్కలిగ గౌడ) సామాజిక వర్గానికి చెందిన కెంపే గౌడ జీవిత చరిత్ర భావితరాల వారికి మార్గదర్శనం,స్ఫూర్తి దాయకమన్నారు. విజయనగర సామంత రాజుగా తీసుకున్న నిర్ణయాలు పరిపాలన దక్షిత ఆనాటి ప్రజల నుంచి విశేషమైన ఆదరణ గౌరవం లభించిందనీ కొనియాడారు. ఆయన మరణించినా కూడా అన్ని వర్గాల ప్రజలు ఆయన ను స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలను, పరిపాలన పరంగా తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయాలను పరిపాలన దక్షతను భావితరాలకు తెలియజేస్తున్నారన్నారు. ఆయన పేరిట బెంగళూరు మహానగరం ఏర్పడిందన్నారు. కెంపెగౌడ బస్ స్టేషన్, కెంపెగౌడ రైల్వే స్టేషన్,కెంపె గౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేశారని తెలియజేశారు. అందుకు ఉదాహరణగా ఈ మధ్యకాలంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరు మహానగరంలో అతిపెద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు, జాతికి అంకితం చేశారన్నారు. ఈనాటి మన తరాల వారు ఆయన జీవిత చరిత్రను తెలుసుకొని మననం చేసుకొని, ఆయన స్ఫూర్తితో ముందుకెళ్లే ప్రయత్నం చేసి భావితరాల వారికి మార్గదర్శకులు కావాలన్నారు. అటువంటి మహోన్నతమైన వ్యక్తి మొరుసు కాపు (వక్కలిగ గౌడ) సామాజిక వర్గ కుటుంబంలో జన్మించడం మనందరికీ కూడా గర్వకారణమన్నారు. అంతటి గొప్ప మహనీయుని స్మరించుకుంటూ ఆయన పుట్టినరోజు వేడుకలు తంబళ్లపల్లి నియోజకవర్గం మొరుసు కాపు కాపు రెడ్డి (వక్కలిగ గౌడ) కుటుంబ సభ్యులు జరుపడం శుభసూచికమన్నారు. కాబట్టి ఈ నెల 27వ తేదీన తంబళ్లపల్లె నియోజకవర్గం, బి.కొత్తకోట పట్టణంలో జరిగే ఆ మహనీయుని జయంతి వేడుకలకు హాజరై,నివాళులర్పించి ఆయన చూపిన మార్గంలో పయనించేలా భావితరాలను సిద్ధం చేయాలని పిలుపునిస్తూ అందరికీ పేరుపేరునా ఆహ్వానిస్తున్నామన్నారు.అలాగే బైక్ ర్యాలీ, ఆత్మీయ సమావేశం వుంటుందని తెలియజేశారు. వక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు ప్రతి ఒక్కరు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో మురుసు కాపు నాయకులు ఎన్నారై కదిరినాయునికోట జయ చంద్ర రెడ్డి, ఎం.ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, పి.శ్రీనాథ్ రెడ్డి,మస్తాన్ రెడ్డి, మార్కురి ఆంజనేయ రెడ్డి, గిరిధర్ రెడ్డి, శివారెడ్డి, రెడ్డప్ప రెడ్డి, నరసింహారెడ్డి,లోక నాథ్, జయభారత్ రెడ్డి, మాధవరెడ్డి, భయ్యా రెడ్డి, రమేష్ రెడ్డి, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










