ప్రజాశక్తి-విజయనగరం కోట : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లా వద్ద విజయనగరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు 4వ రోజు రిలే నిరాహారదీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు సంఘీభావం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసును అక్రమ అరెస్టును చట్ట పరంగా ఎదుర్కొంటామని టిడిపి ఎమ్మెల్సీ దువ్వరపు రామారావు అన్నారు. శనివారం నాడు విజయనగర పట్టణ కేంద్రంలో అశోక్ బంగ్లాలో టిడిపి కార్యాలయం ముందు చంద్రబాబుతో నేను అనే మహిళలు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతు తెలపడానికి వచ్చిన ఆయన ముందుగా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకుని చంద్రబాబును అక్రమ కేసు నుండి వేగంగా బయటికి వచ్చినట్లు చేయాలని కోరుతూ నోటక్క కొబ్బరికాయలు కొట్టి ప్రార్థన చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును అందరం ఖండిస్తున్నామం, తెలుగుదేశం పార్టీ పరంగా గత వారం రోజులుగా నాయకులు ప్రజలు విద్యార్థులు ఐటి ఉద్యోగులు అందరూ బయటకు వచ్చి అనేక నిరసనలు తెలియజేయడం గమనిస్తున్న విషయం ఈ రోజున ఏదైతే ఈ కేసులో లెక్కించారు స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి ఆయనకి ఎటువంటి సంబంధం లేని కేసు. దీనికి అన్యాయంగా ఇరికించారు స్కిల్ డెవలప్మెంట్ అంటే యూత్ ని ఉద్దేశించి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాం అదే విధంగా ఎంప్లాయిమెంట్ కల్పించే ప్రోగ్రాం ఇది ఒక ట్రైపార్టెండ్ ప్రోగ్రాం ద్వారా మూడు ఆర్గనైజేన్స్ కలిపి చేసిన ప్రోగ్రాం అది ఒక పాలసీ మేకర్ గా చంద్రబాబు బాధ్యత వహిస్తారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరూ కూడా దీన్ని స్కిల్ డెవలప్మెంట్ లోకి తీసుకు వెళ్ళవలసి ఉంది కాబట్టి ఏ చిన్న అక్రమం జరిగినా అధికారులే దానికి బాధ్యత వహించవలసి ఉంటుంది కానీ ఇక్కడ ఒక్కటే ఒక్క విషయం తెలియజేస్తున్నాను వికాస్ కన్వీనర్ ఎవరైతే ఉన్నారో డిజైన్ సెక్షన్ చైర్మన్ ఆయన చాలా క్లియర్ గా అరగంట వీడియో రిలీజ్ చేశారు ప్రభుత్వపరంగా రిలీజ్ అయిన 3 81 కోట్లు కూడా ప్రతి పైసాకు లెక్క ఉంది వచ్చి మీరు వేరుపేసుకోండి అని చెప్పారు అదేవిధంగా స్కిల్ సెంటర్లను వెరిఫై చేసుకోండి అందులో ట్రైనింగ్ అయిన విద్యార్థులను ఉద్యోగాలు పొంది న ఉద్యోగస్తులను వచ్చి మీరు వెరిఫై చేసుకోండి అని చెప్తుంటే మొత్తం స్కిల్స్ సెంటర్లు క్లోజ్ చేసి ఎవరిని అక్కడకు వెళ్ళనీకుండా ఏది వేరికే చేయనీయకుండా మొత్తం వికాసం అంతా క్లోజ్ చేసి ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ ను అడ్డుపెట్టుకుని మా చంద్రబాబు నాయుడు ఇరికించడమైనది ఇది అత్యంత దుర్మార్గం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఐ వి పి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి బంగారు బాబు, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలి నాయుడు, పార్టీ కార్యాలయ కార్యదర్శి రాజేష్ బాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ కనకమహాలక్ష్మి, శ్రీనివాసరావు టిడిపి నాయకులు పాల్గొన్నారు.










