Oct 24,2023 12:09

ఇంఫాల్‌  :   అక్రమ ఆయుధాలను కలిగి ఉన్న ఓ ఉగ్రవాదిని మణిపూర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 1200కు పైగా కాట్రిడ్జ్స్‌ (బుల్లెట్లు), 68 లాథోడ్‌ పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. శనివారం ఇంఫాల్‌ వెస్ట్‌ జిల్లాలోని మొయిరాంగ్‌ఖోమ్‌ రహదారిని దాటుతున్న ఓ కారును ట్రాఫిక్‌ పోలీసులు ఆపారు. అయితే కారులోని వ్యక్తి పారిపోయేందుకు యత్నించగా .. పోలీసులు అడ్డుకున్నారు. వాహనాన్ని తనిఖీ చేయగా 7.62 మి,మీ కలిగిన 573 రౌండ్ల బుల్లెట్లు, 5.56 మి.మీ కలిగిన 294 రౌండ్ల బుల్లెట్లు, పేలుడు పదార్థాలు లభించాయి. ఆ ఉగ్రవాదితో పాటు ఆయుధాలను మణిపూర్‌ పోలీసులకు అప్పగించినట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.