
ప్రజాశక్తి-వేపాడ : వేపాడ మండలం సోంపురం సచివాలయం పరిధిలో గల నర్సిపెల్లి మట్ట వద్ద వలస కూలీలు సుమారు 50 కుటుంబాలు నేటికీ 40 సంవత్సరములుగా నివాసముంటు క్వారీ పనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరిలో కొన్ని కుటుంబాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నవి, కొంతమందికి రేషన్ కార్డు లు, ఆధార్ కార్డులు కూడా లేవు, ప్రభుత్వం మంజూరు చేస్తున్న జగనన్న సామాజిక పింఛన్లు అర్హత ఉన్నప్పటికీ పింఛన్లు మంజూరు చేయలేదని వలస కూలీలు ఆరోపణ. పరిమార్లు రేషన్ కార్డులకు, సామాజిక పింఛన్ల కొరకు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేదు అని చెబుతున్నారు కలుసుకోలేదు. ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తా అన్నావని మాటల వరకే తప్ప చేతల్లో మాత్రం మాకు న్యాయం జరగలేదు, మా పిల్లలు చదువులు కూడా నోచుకోలేదు. సోంపురం గ్రామానికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో మేమున్నాము మా పిల్లలను పాఠశాల పంపించాలని ఉన్నప్పటికీ ఇబ్బందిగా ఉన్నది, నేటికీ మేము సాయంత్రం అవగానే కొవ్వొత్తుల వెలుగులో భోజనాలు చేసి పడుకోవాల్సిందే, ఇప్పటికైనా ప్రభుత్వం మా కుటుంబాలకు జగనన్న గృహములు, విద్యుత్ సౌకర్యము, మా పిల్లలకు చదువుకునే విధంగా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ గారిని స్వయంగా మేము నివసిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించి మానవతా దృక్పథంతో ప్రభుత్వ పరంగా మాకు చేస్తారని కోరుతున్నారు.