
- ఏడు గంటల్లో కోటి మంది చేరిక
వాషింగ్టన్ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌కు పోటీగా మెటా తన థ్రెడ్స్‌ను తీసుకువచ్చింది. దీన్ని విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మెటా థ్రెడ్స్ యాప్ యూరోపియన్ యూనియన్‌లోని కొన్ని దేశాల్లో తప్ప ప్రపంచంలోని దాదాపు 100కి పైగా దేశాల్లో గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌లో 500 అక్షరాల వరకు పోస్ట్ చేయవచ్చు. ట్విటర్ తరహా ఫీచర్లతో అదనంగా కొన్ని జోడించింది. ఇన్‌స్టాలో అనుసరిస్తున్న ఖాతాలను, కొత్త యాప్‌పైనా అనుసరించే సౌలభ్యం ఉంది. ఇందులో ట్విటర్‌లో లేని కొన్ని అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ యాప్ వినియోగించాలనుకునే వారు ఇప్పటికే ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా లాగిన్ అవ్వొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న అందరూ ఇందులో కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది.