Jun 23,2023 11:02

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : ఈనెల 25న రైల్వే కోడూరు నియోజకవర్గం లోని పెనగలూరులో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత రూపానంద రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధురై అరవింద్ హాస్పిటల్ వైద్య సిబ్బంది సహకారంతో అన్నమయ్య జిల్లా అందత్వ నివారణ సంస్థ పర్యవేక్షణలో ఈ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నామని, పేషెంట్లకు, వారితోపాటు వచ్చే సహాయకులకు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రత్యేక వాహనంలో అరవింద్ ఆసుపత్రికి తరలించి ఆపరేషన్లు నిర్వహించి, కంటి అద్దాలు అవసరమైన వారికి ఉచితంగా అందజేసి తిరిగి వారిని వారి ప్రాంతాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.