Jul 12,2023 15:16
  • రాజంపేట శాసనసభ్యులు మేడా

ప్రజాశక్తి-రాజంపేట రూరల్ : వాలంటరీల గురించి మాట్లాడే అర్హత పార్ట్ టైం పొలిటీషియన్ పవన్ కళ్యాణ్ కు లేదని, కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి ప్రజలకు అన్ని సేవలు అందించిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ అని రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జునరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ వాలంటరీ వ్యవస్థను హేళన చేస్తూ మాట్లాడిన మాటలకు మీరు అధైర్య పడొద్దు మీ వెంటే మేమున్నామంటూ ఆయన అన్నారు. బుధవారం రాజంపేట మండలం మిట్టమీద పల్లి గ్రామ సచివాలయం నందు జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో అర్హులైన 123 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్లను రాజంపేట శాసనసభ్యులు మేడా, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటీ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట తప్పని మడమ తిప్పని నేత అయినా స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి  తనయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నవరత్నాలు అమలు చేసి ప్రజలు దీవెనలను  పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి అని తెలిపారు. పవన్ కళ్యాణ్ వాలంటరీ గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు అదే వాలంటరీ దగ్గరికి వెళ్లి రాబోయే ఎలక్షన్ సమయంలో ఓట్లు అడిగినప్పుడు వాళ్లే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు, రాజంపేట గ్రామీణ జెసిఎస్ కన్వీనర్ మందరం గంగిరెడ్డి, జడ్పిటిసి ప్రతినిధి దాసరి పెంచలయ్య రాజంపేట గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ హస్తవరం ఉమామహేశ్వర్ రెడ్డి నాగేశ్వర్ నాయుడు, కే.వెంకటేష్, కే.నరసింహులు, కుందా నెల్లూరు వెంకటేశ్వర్ రెడ్డి, దండు గోపి, సుబ్బరాయుడు, జయరాం, పోలి మురళి రెడ్డి విశ్వనాథ రెడ్డి, మహేష్, ఎక్స్ ఎంపిటిసి రెడ్డయ్య  తదితరులు పాల్గొన్నారు