
ప్రజాశక్తి - బి.కొత్తకోట : సమస్యల పరిష్కారమే ఎజెండాగా తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోట మండలం సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఎంపీడీవో శంకరయ్య ప్రారంభించారు.మండల అధ్యక్షులు ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ,జడ్పిటిసి రామచంద్రయ్య యాదవ్, మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్ రెడ్డి, సభా వేదికపై ఆహ్వానించారు. మండల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఎంతో కృషి చేస్తున్నట్లు మండల ఎంపిపి లక్ష్మీనరసమ్మ తెలిపారు. అదేవిధంగా జడ్పిటిసి రామచంద్రయ్య మాట్లాడుతూ ప్రతి సచివాలయంలోనూ ఇంజనీర్లు కానీ ఇతర అధికారులు గాని వాలంటీర్లు కానీ పనితీరు మెరుగుపరుచుకున్నారు తెలిపారు. అలాగే డిప్యూటీ తహసిల్దార్ మహమ్మద్ అన్సర్ మాట్లాడుతూ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా సకాలంలో పనులు చేస్తున్నామని తెలిపారు.అలాగే ఎంపీడీవో శంకరయ్య మాట్లాడుతూ ప్రతి మూడు నెలలకు ఒక్కసారి నిర్వహించే మండల సర్వసభ వేశానికి వచ్చినప్పుడు ప్రతి శాఖకు చెందిన వాళ్లు మూడు రోజులు ముందే నివేదిక సమర్పించాలని తెలిపారు. అలాగే మూడు సర్వసభ సమావేశానికి హాజరుకాని ఎంపీటీసీలపై రాజ్యాంగబద్ధంగా వారి పదవి నుంచి తొలగిస్తామని వెల్లడించారు. కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అలాగే విద్యుత్ శాఖ ఏఈ గిరిధర్ మాట్లాడుతూ మండలంలో రెండు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించేందుకు అనుమతులు వచ్చాయని అందులో భాగంగా మండలంలోని రెండు విద్యుత్ సబ్ స్టేషన్లకు నిర్మాణానికి అనుమతులు వచ్చినట్లు తెలిపారు.అలాగే విద్యుత్ సబ్ స్టేషన్లకు నిర్మాణానికి రెవిన్యూ శాఖ వారు ఒక విద్యుత్ సబ్ స్టేషన్ కి స్థలం కేటాయించారు. మరొక విద్యుత్ సబ్ స్టేషన్ కి రెవెన్యూ వారు సహకరించాలని లేకుంటే అనుమతులు రద్దు అవుతాయని విన్నవించుకున్నారు అలాగే బి.కొత్తకోట మండలంలో ఎస్సీ ఎస్టీలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం విదితమే. ఇప్పుడు ప్రభుత్వం 100 యూనిట్ల నుంచి 200 యూనిట్లు వరకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇస్తుంది దీని ద్వారా నెలకు 1782 ఎస్సీ ఎస్టీ ఇళ్లకు మూడు లక్షల 88000 ప్రభుత్వం మన మండలానికి చెల్లిస్తా ఉంది అలాగే ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్లు దాటిన వారి మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.పశువైద్యాలు కిరణ్మయి మాట్లాడుతూ పాడి పశువులకు అనారోగ్యంతో ఉన్నప్పుడు అత్యవసర సమయంలో 1962 ఫోన్ చేస్తే అంబులెన్స్ అందుబాటులో ఉంటుందని ప్రజలు ఈ అంబులెన్స్ ని ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే మూడు నెలల ఆవుదూళ్ళకి ఎఫ్ఎండి ఇంజక్షన్ వేపించుకొని ఆవులు ఆరోగ్యంగా ఉండేందుకు సహకరించాలని తెలిపారు. ఈ సమావేశం ఉపాధి హామీ అధికారి మంజుల, మండల విద్యాశాఖ అధికారులు రెడ్డి శేఖర్, భువనేశ్వర చారి,డిప్యూటీ తహసిల్దారుగా మొహమ్మద్ అన్సారి, ఈవో పిఆర్ డి అశ్విని, మండలం ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్ రెడ్డి, ఏఎస్ఐ బొజ్జ నాయక్, కానిస్టేబుల్ శేఖర, ఎంపీటీసీలు సుబ్బయ్య నాయుడు,రామ సుబ్బారెడ్డి, సర్పంచులు వేమలేటి కోటి రవి,గుడిపల్లి సర్పంచ్ రఘు,బడికాయలపల్లి సర్పంచ్ ఆదెప్ప గౌడ్. వైస్ ఎంపీపీ ఖాదర్ వలీ, కో-ఆప్షన్ నాసర్, ఎంపీడీవో ఏవో థామస్,ఎంపీడీవో ఆఫీస్ జూనియర్ అసిస్టెంట్ ప్రతాప్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.