Sep 13,2023 21:42

్తతిరుపతిలో న్యాయవాదుల దీక్షలు

చంద్రబాబుకు మద్దతుగా దీక్షలు
మేముసైతం..!
ప్రజాశక్తి - తిరుపతి టౌన్‌, యంత్రాంగం
చంద్రబాబు రిమాండ్‌ను నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా నిరసన దీక్షలు జరిగాయి. తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ ఆధ్వర్యంలో నిరసనదీక్ష సాయంత్రం వరకూ చేపట్టారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తాడని, ఏమాత్రం సంబంధం లేకపోయినా కేసులో ఇరికించారని వక్తలు ఉద్ఘాటించారు.
కోటలో... నిరసన దీక్ష కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పాల్గొన్నారు. పార్లమెంటరీ కార్యనిర్వాహక కార్యదర్శి వాకా విజయభాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్ష జరిగింది. శాంతిపురంలో.. సైకో జగన్‌ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను, అక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని వక్తలు అన్నారు. వైసిపి ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేస్తారన్నారు. 23 పంచాయతీల్లోని నేతలు, కార్యకర్తలు, అభిమానులు దీక్షల్లో పాల్గొన్నారు. ఎంఎల్‌సి గౌనివారి శ్రీనివాసులు, వివి నాగరాజ్‌, విజయరామరెడ్డి, ఉదరుకుమార్‌ పాల్గొన్నారు. గంగాధరనెల్లూరులో.. రాజకీయ కక్షతోనే వైసిపి కుట్ర పన్నిందని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహర్‌నాయుడు ధ్వజమెత్తారు. మండల కేంద్రంలో టిడిపి రిలే దీక్ష నిర్వహించారు.నేతలు క్రిష్ణమనాయుడు, వెంకటేష్‌, శ్రీధర్‌యాదవ్‌, స్వామిదాస్‌, దేవసుందరం పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో... తొట్టంబేడు మండలంలోని ఇలగనూరులో రిలేదీక్ష చేపట్టారు. చంద్రబాబు అరెస్టు జీర్ణించుకోలేక గుండెపోటుతో మృతిచెందిన వెంకటరమణ చిత్రపటానికి నివాళి అర్పించారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి బొజ్జల వెంకట సుధీర్‌రెడ్డి, మాజీ ఎంఎల్‌ఎలు ఎస్‌సివి నాయుడు, సత్రవాడ మునిరామయ్య, నాయకులు గాలి మురళీనాయుడు, గాలి చలపతినాయుడు, దశరథాచారి పాల్గొన్నారు. పలమనేరులో.. అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పార్టీ అధ్యక్షులు నాగరాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేష్‌, నాయకులు మల్లీశ్వర్‌రెడ్డి, సుబ్రమణ్యం పిళ్లే, రామ్మూర్తినాయుడు, సెల్వరాజ్‌, వెంకటమునిరెడ్డి నాయకత్వం వహించారు. రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. చంద్రబాబును విడుదల చేసేంత వరకూ రిలే నిరాహారదీక్ష కొనసాగిస్తామని తెలిపారు.
న్యాయవాదుల నిరసన
నారా చంద్రబాబునాయుడుని అకారణంగా అరెస్టు చేసి నిర్బంధించినందుకు నిరసనగా తిరుపతి లోని తెలుగుదేశం పార్టీ లీగల్‌ సెల్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు బుధవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు .ఈ సందర్భంగా రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి దినకర్‌ మాట్లాడుతూ బాబు పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అని, వాళ్ళ సైకో పరిపాలనకు ఇది నిదర్శనమని, ఏ నేర చరిత్ర లేని చంద్రబాబు నాయుడు మీద, ఏదో ఒక నేరం కావాలనే వేయాలని చేసేటువంటి ప్రయత్నమే తప్ప చంద్రబాబు నాయుడు కి ఎటువంటి సంబంధం లేని కేసులో అరెస్ట్‌ చేయడం ఘోర తప్పిదమని దీనికి తగిన మూల్యం చెల్లించక తప్పదని అన్నారు. .ఈ కార్యక్రమంలో రాష్ట్ర లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శులు రమణ , వసుమతి, తిరుపతి జిల్లా లీగల్‌ సెల్‌ అద్యక్షులు బాలకష్ణమ నాయుడు , తిరుపతి అద్యక్షులు వేణుగోపాల్‌ , సీనియర్‌ న్యాయవాదులు మోహన్‌, గొట్టి సుబ్రమణ్యం , గజేంద్ర, ఆదినారాయణ, ఉమాపతి, రవిచంద్ర, మునెయ్య, శివకుమార్‌, కొర్రపాటి శ్రీనివాస్‌, శ్రీధర్‌ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

్తతిరుపతిలో న్యాయవాదుల దీక్షలు