మాయలపాడులో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. రంగయ్య కూలి పనులు చేసుకుని బతికేవాడు.
రంగయ్య కొడుకు ప్రదీప్‌ను బడికి పంపితే.. ప్రదీప్ బడికి వెళ్ళకుండా అక్కడక్కడా తిరిగి ఇంటికి చేరుకునేవాడు.
ప్రదీప్‌కు చదువు అబ్బ లేదు. ప్రదీప్‌కు పదిహేను సంవత్సరాలు నిండాయి. వాళ్ళ నాన్న రంగయ్య కూలికి వెళ్ళగా, పాము కరిచి చనిపోయాడు. వాళ్ళ అమ్మ ఎంతో బాధపడింది.
పనులు దొరక్క ఆకలితో ఉండిపోయారు తల్లీ కొడుకులు.
హైస్కూల్‌లో పనిచేసే శ్రీనివాసరావు మాస్టారు సైకిల్ మీద పక్క ఊరికి వెళుతూ ప్రదీప్ తల్లికి ఒక సలహా ఇచ్చారు.
ఆ సలహా ప్రకారం వెంటనే ఇంటి చుట్టూ ఉన్న స్థలానికి దడి కట్టారు తల్లీ కొడుకులు. ఇంటి చుట్టూ వున్న పెద్ద స్థలంలో కూరగాయ మొక్కలు వేశారు. కూరగాయలు బాగా కాశాయి. దాంతో ప్రదీప్ ఒక ఊరుకి, వాళ్ళ అమ్మ మరొక ఊరుకి వెళ్లి కూరలు అమ్మి, డబ్బులు సంపాదించేవారు. రోజు ఖర్చులు పోగా, మిగిలిన డబ్బులు పోస్టాఫీసులో దాచుకున్నారు. శ్రీనివాసరావు మాస్టారి సలహా వలన కూరగాయలు పండించి, అమ్ముకోవడం వలన నాలుగు సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోగలిగారు. ప్రదీప్‌కు పెళ్లి చేసింది తల్లి. ఇప్పుడు అందరూ శ్రమ చేసుకుని సుఖంగా బతుకుతున్నారు.
- ఆర్. మానస,
7వ తరగతి,
జిల్లా పరిషత్ హైస్కూల్, పెనుమాక.