Apr 27,2023 15:31

ప్రజాశక్తి-భవనిపురం : విద్యాధరపురం లేబర్ కాలనీలో గల కార్మిక శాఖ స్థలం లో వైస్సార్సీపి పార్టీ కార్యాలయం నిర్మించవద్దని చెరువు సెంటర్ లోని సీపీఐ పార్టీ ఆఫీస్ వద్ద సీపీఐ, సీపీఎం పార్టీలు గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమములో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనెపూడి కాశీనాధ్, సీపీఎం నాయకులు కె.సూరిబాబు, కుండానాల శేషుమని, కాంతారావు, బి.పుల్లారావు, సుకుంద, సుదర్శన్, సీపీఐ నగర కార్యదర్శి జి. కోటేశ్వరరావు, టి.పీడయ్యా, పి. దుర్గాంబ, శివప్రసాద్ రాజు, వై. జోసఫ్, కె. భార్గవ తదితరులు పాల్గొన్నారు.