బెంగళూరు : కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇస్రో శనివారం తన మొదటి ప్రయోగాన్ని చేపట్టనుంది. తొమ్మిది అంతర్జాతీయ ఉపగ్రహాలతో పాటు భూమిని పరిశీలించే ఉపగ్రహం ఇఒఎస్-10ను మోసుకెళ్లే పిఎస్‌ఎల్‌వి-సి 49 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. శనివారం మధ్యాహ్నం 15:02 (3:02) గంటలకు శ్రీహరి కోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్ ప్రయోగించనున్నట్లు ఇస్రో తెలిపింది. భారత్ 51వ మిషన్‌లో భాగంగా ప్రయోగించే ఈ వాహకనౌక ద్వారా తొమ్మిది అంతర్జాతీయ ఉపగ్రహాలను కూడా తీసుకెళ్లనుంది. ఇఒఎస్-01 ఉపగ్రహం భూమిపై వ్యవసాయం, అటవీ భూముల పరిశీలనతో పాటు విపత్తు నిర్వహణ సంస్థకు మద్దతుగా సహకారం అందిస్తుందని ఇస్రో తెలిపింది.










