బెంగళూరు : కర్ణాటకలో గత బిజెపి ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద మత మార్పిడి నిరోధక చట్టాన్ని రద్దు చేయాలని ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ మేరకునిర్ణయం తీసుకున్నారు. కర్ణాటక మత స్వేచ్ఛ హక్కు రక్షణ బిల్లు 2022 (మత మార్పిడి నిరోధక బిల్లుగా విమర్శల పాలైంది)ను బసవరాజ్ బమ్మై నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2022 సెప్టెంబరులో అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా అప్పటి హోం మంత్రి ఆరగ జ్ఞానేంద్ర ఈ బిల్లును ప్రవేశపెట్టారు. తప్పుడు మార్గాలు, బలవంతంగా, ఆకర్షణతోనూ, మోసపూరితంగానూ లేదా వివాహం ద్వారానూ మత మార్పిడిని నిరోధించడానికి ఈ చట్టం తీసుకొచ్చినట్లు బమ్మై ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. '2022లో బిజెపి తీసుకొచ్చిన ఈ చట్టం రద్దవుతుంది. మేం తీసుకొచ్చే బిల్లు రాజ్యాంగానికి లోబడి ఉంటుంది' అని కర్ణాటక న్యాయశాఖ మంత్రి హెచ్‌కె పాటిల్ గురువారం తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు ప్రజలకు, పేదలకు వ్యతిరేకమని, అమానవీయమైనదని, రాజ్యాంగ వ్యతిరేకమని, కఠినమైనదని కాంగ్రెస్, జెడి(ఎస్), ఇతర ప్రతిపక్షాలు విమర్శించాయి. బిల్లును ఆమోదించవద్దని కోరాయి. బిజెపి ఈ బిల్లు పేరుతో మైనారిటీలపై కక్ష సాధింపులో భాగంగా అనేక నిబంధనలు పెట్టింది. చట్టానిు అతిక్రమిస్తే రూ.50 వేల జరిమానాతో మూడు నుంచి ఐదేళ్ల వరకూ శిక్ష విధించేలా నిబంధనలు చేర్చగా, తాజాగా సిద్ధరామయ్య సర్కారు ఈ చట్టాన్ని రద్దు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అనిు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో రాజ్యాంగ పీఠికను చదవడం తప్పనిసరి చేసింది. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెడ్గేవార్ పాఠానిు పాఠ్యాంశాల నుంచి తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతోపాటు బిజెపి ప్రభుత్వం గతంలో సిలబస్‌లో లౌకిక విధానాలకు తూట్లు పొడుస్తూ చేసిన మార్పులనిుంటినీ రద్దు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.










