ప్రజాశక్తి-తోటపాలెం : స్థానిక తోట పాలెంలో గల సత్య డిగ్రీ మరియు పీజీ కళాశా లలో కరాటే కోచ్ శ్రీ. కే. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న విద్యార్ధిని విద్యార్థులకు సత్య విద్యా సంస్థలు మరియు ధీర ఫౌండేషన్ సంయుక్తంగా కరాటే కిట్ ను అనగా కిక్ షీల్డ్స్ రెండు, పూర్తి కరాటే కిట్ హెడ్ గార్డ్స్ తో సహా రెండు 30,000/- రూపాయల విలువ గల వాటిని అందచేయటం జరిగింది. కళాశాల సంచాలకులు డాక్టర్. ఎం.శశిభూషణరావు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఎం.వి. సాయి దేవమణి ఈ కిట్ ను విద్యార్థులకు అందజేశారు. శశి భూషణరావు మాట్లాడుతూ చిన్న వయసులోనే ఈ కరాటే విద్యలో ఆరితేరి ఎన్నో పోటీలకు హాజరయి పతకాలను సంపాదించాలని కోరారు. ఈ కిట్ విద్యార్థులందరూ వినియోగించుకొని పరిపూర్ణంగా ఈ కరాటే లో రాణించాలని కోచ్ సంతోష్ మాట్లాడుతూ సత్య విద్యా సంస్థల వారు తనను తన విద్యార్థులను చాలా ప్రోత్సహిస్తున్నారని, ఈ కిట్ విద్యార్థులకు చాలా బాగా ఉపయోగపడుతుందని, కరాటే కిట్ ను ఇచ్చినందుకు గాను సత్య విద్యా సంస్థల వారికి ధీర ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియచేశారు.










