Nov 02,2020 16:06

హైదరాబాద్‌ : దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా చేయాలని ఆర్థికశాఖామంత్రి హరీష్‌రావు తెగ పనిచేస్తున్నారు. కానీ, కేసిఆర్‌ త్వరలో హరీష్‌రావుకు షాక్‌ ఇవ్వనున్నారని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ విజయశాంతి అన్నారు. కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనే యోచనలో కేసిఆర్‌ ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగానే కెసిఆర్‌ భాజపాపై నెపం నెట్టి రాజీనామా చేస్తానని సంకేతిలివ్వడం జరుగుతోందని వ్యాఖ్యానించారు. తాజా పరిస్థితులను చూస్తే దుబ్బాక ఉపఎన్నిక, జీహచ్‌ఎంసి ఎన్నికల తర్వాత కేటిఆర్‌ను సిఎం చేసే యోచనలో కేసిఆర్‌ ఉన్నారని విజయశాంతి అన్నారు. నమ్మిన వారిని మోసం చేయడంలో సిఎం స్టైలే వేరని ఆమె విమర్శించారు.