ప్రజాశక్తి-అమరావతి : కార్మికుల కనీస వేతనాల అమలు కోరుతూ నేడు రాష్ట్రవ్యాప్తంగా సిఐటియు అన్ని జిల్లాల కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద మహాధర్నాలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో... మంగళవారం ఆయా జిల్లాలోని సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులంతా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించారు. పలుచోట్ల పోలీసులు నిరసనలను అడ్డుకున్నారు. అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు కదంతొక్కారు. నిరసనలు హోరెత్తాయి.





































