
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావాలంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని రాజంపేట నియోజకవర్గ జనసేన యువ నాయకులు అతికారి దినేష్ పేర్కొన్నారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం యువగర్జన సంఘీభావ దీక్షను నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు జనసేన యువనాయకుడు పోలిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన యువగర్జన దీక్షకు సంఘీభావంగా జనసేన నాయకులు వీర మహిళలతో ఒక్కరోజు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు అతికారి దినేష్ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని యువతీ, యువకులు ఉపాధి-ఉద్యోగ అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలసలుగా వెళ్ళిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ కృత నిశ్చయంతో ఉన్నారని., ఆయనకు అవకాశం ఇస్తే రాబోయే ఎన్నికల్లో టిడిపి తో కలిసి రాష్ట్రంలో అధికారం చేపట్టి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు అవకాశం ఇస్తే యువతీ, యువకులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో జనసేన నాయకులు భాస్కర్ పంతులు, కోలాటం హరి, నాగార్జున, ఓబులేష్, రామ శ్రీనివాస్, గోపి, వెంకటయ్య, ఆచారి, చౌడయ్య, వెంకటేష్, గోపాల్, జనసేన వీర మహిళలు జడ్డా శిరీష, మాధవి తదితరులు పాల్గొన్నారు.