
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్లమెంట్ ఇంచార్జి ముకరం చాన్ అన్నారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో పోలిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ముకరం చాన్ పాల్గొని మాట్లాడుతూ వైసీపీ నేతలు జోగి రమేష్, అంబటి రాంబాబు, కొరముట్ల శ్రీనివాసులు, రోజా వారి స్థాయి మరిచి తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకోవడం తగదని హితవు పలికారు. రానున్న ఎన్నికలలో నగిరి నియోజకవర్గంలో రోజాకు సీటు కూడా దక్కదని అన్నారు. పవన్ కళ్యాణ్ పై నోరు పారేసుకుంటే సహించేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, రామా శ్రీనివాస్, గోపి, చౌడయ్య తదితరులు పాల్గొన్నారు.