Jul 10,2023 14:58

ప్రజాశక్తి-బి.కొత్తకోట : ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని తక్షణమే పరిష్కరించేందుకే జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి తెలిపారు. సోమవారం పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రజలకు 601 వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బి.కొత్తకోట  మున్సిపాలిటీకి సిఎం ఇప్పటికే రూ18.50 కోట్లు నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.జగనన్న సురక్ష కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్ నరసింహ ప్రసాద్, వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు ఖలీల్ అహ్మద్ పట్టణ అధ్యక్షులు రాజన్న,మండల జెసిఎన్‌ కన్వీనర్‌ రెడ్డి హరి, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ కంచి కళ్యాణ్ కుమార్ రెడ్డి, హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు కంచి బలరాంరెడ్డి, హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కంచి సురేందర్ రెడ్డి, జెడ్పిటిసి రామచంద్ర యాదవ్, మలకలచెరువు మార్కెట్ యార్డ్ చైర్మన్ సురేంద్ర, సచివాలయాల కన్వీనర్లు ఎస్ఎస్ ఫయాజ్, గుమ్మడికాయల చాంద్ భాషా, సిఆర్ చిన్నికృష్ణ, అంజమ్మ, నక్క సంతోష్, జీవి రామకృష్ణ, రమేష్ రెడ్డి, సర్పంచులు రవి, రఘునాథ్, మడుమూరు భాస్కర్ నాయుడు, పెద్దతిప్పసముద్రం మండలం ఎంపీపీ మహమ్మద్, కో-ఆప్షన్ మెంబర్ నాసర్, వైసీపీ నాయకులు కంచి కోదండ, భీమ్ గాని ప్రభాకర్ రెడ్డి, తుమ్మగింజల జనార్ధన్, నరసింహనాయుడు, ఎంవి కృష్ణయ్య, పవన్, నక్క మహేష్ ,రాయలసీమ రమేష్ రెడ్డి, ఎంపీడీవో శంకరయ్య, తాసిల్దార్ రఫీ అహ్మద్, మండల విద్యాశాఖ అధికారి రెడ్డిశేఖర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు షఫీ, సుభాష్ ,వైసిపి కార్యకర్తలు  పాల్గొన్నారు.