- హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు
ప్రజాశక్తి - బి.కొత్తకోట : ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ కార్యక్రమం బి.కొత్తకోట మండలంలోని సొరుపువారిపల్లిలో ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం మండలంలోని సొరుపువారిపల్లిలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ, జడ్పిటిసి రామచంద్ర యాదవ్,ఎంపీడీవో శంకరయ్య, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ పనిచేస్తున్నారన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలు కుల దృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, మరణ ధృవీకరణ పత్రం, వివాహ దృవీకరణ పత్రం, కుటుంబ సభ్యుడి దృవీకరణ పత్రం,మ్యుటేషన్ లావాదేవీలు, ఆధార్ ఫోన్ నంబర్ అనుసంధానం, పంటసాగు హక్కు కార్డు, కొత్త రేషన్ కార్డులు మంజూరు, రేషన్ కార్డుల్లో మార్పులు,చేర్పులు చేసుకొనే అవకాశం తదితర సమస్యలను పరిష్కరించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించిందన్నారు. కావున ఈ అవకాశాన్ని మండలంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రఫీక్ అహమ్మద్, మండల ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్ రెడ్డి,
కో-ఆప్షన్ మెంబెర్ ఎస్.నాసిర్,మరియు,సచివాలయ సిబ్బంది,వాలంటీర్లు మరియు ప్రజలు పాల్గొన్నారు.










