Oct 18,2023 15:21

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ప్రజల ఆరోగ్య సంరక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి, జెడ్పి చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మిట్టమీద పల్లె గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిధులుగా పాల్గొని ప్రసంగిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో పేద ప్రజల కోసం లక్షల మంది వైద్య సిబ్బందితో రాష్ట్రంలో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ ద్వారా గ్రామాల్లో ఉన్న అనారోగ్య వ్యక్తులను గుర్తించే విధంగా జల్లెడ పట్టి వారికున్న ఆరోగ్య సమస్యలను తెలుసుకునే మార్గాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే నని అన్నారు. ప్రతిపక్షాలు  సీఎం పై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎంత ఖర్చైనా పర్వాలేదని లక్షల మంది వైద్య సిబ్బందితో ఇంటింటికి వెళ్లి అనారోగ్యంగా ఉన్న వారిని గుర్తించేందుకు వాలంటీర్ల ద్వారా, సిబ్బంది ద్వారా మంచి కార్యక్రమాన్ని అందుబాటులోకి తెచ్చి ప్రజలు బాగుంటే గ్రామాలు బాగుంటాయని, గ్రామాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారన్నారు. సభ వేదిక వద్ద మాట్లాడిన అనంతరం  రిజిస్ట్రేషన్ కౌంటర్, స్పాట్ కౌంటర్, రెఫరల్ కౌంటర్, ఓ.పి గదుల వద్ద వైద్యులు పరీక్షించే కౌంటర్లు, ల్యాబ్ టెస్టింగ్ కౌంటర్, ఐ చెకప్ కౌంటర్లను, పౌస్టికహర అవగాహన కోసం ఐసీడిఎస్ వారు ఏర్పాటు చేసిన స్టాల్ కౌంటర్ లను సందర్శించి ఐదు మంది వైద్యుల సమక్షంలో జరుగుతున్న సురక్ష కార్యక్రమంలో వైద్యం కొఱకు వచ్చిన వ్యక్తులతో ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వైద్యులతో మాట్లాడారు. అనంతరం ప్రజలకు సురక్ష కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో అన్నమచార్య కలాశాల చైర్మన్ చోప్ప యల్లారెడ్డి, వైఎస్ఆర్సిపి మండలాధ్యక్షులు రామ్మోహన్ నాయుడు, మండల జేసిఎస్ కన్వీనర్ మందరం గంగిరెడ్డి, ప్రభుత్వాసుపత్రి డైరెక్టర్ హస్తవరం ఉమామహేశ్వర్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్యాల రామకృష్ణ, సౌమ్యనాథ స్వామి దేవాలయం మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, డీసీఎంఎస్ చైర్మన్ దండు గోపి, దాసరి పెంచలయ్య, పోలి మురళి మోహన్ రెడ్డి, పాపినేని విశ్వనాథ రెడ్డి, శంకర్ శెట్టి, ముక్క విశ్వనాథ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.