Oct 16,2023 14:42

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : పురపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. మునిసిపల్ పరిధిలోని 7, 8, 9 వార్డుల్లోని వృద్ద్ద, రోగగ్రస్థ అస్వస్థత బారిన పడిన ప్రజలకు పురపాలక కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట వైద్య సేవలు అందించి ఉచిత మందులు అందజేశారు. ఈ సందర్బంగా మునిసిపల్ కమిషనర్ ఎం.జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అందరికి ఆరోగ్యం అందించాలనే లక్ష్యంలో ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. మరో రెండు విడతలుగా మంగళవారం, శుక్రవారం ఈ కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ప్రభుత్వసేవలు ప్రజలకు అందించే దశలో పలు వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉచిత నేత్ర పరీక్షలు, జ్వరం, తలనొప్పి, రక్తపోటు, మధుమేహం, తదితర రకాల పరీక్షలు నిర్వహించారు. రోగులకు ఉచిత మందులు, జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వార్డు సచివాలయ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, వాలంటీర్ల బృందం తోపాటు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యులు, ఏ ఎన్ ఎం లు, సహాయకులు పాల్గొన్నారు.