Jan 26,2021 11:13

పశ్చిమ గోదావరి (పాలకొల్లు) : పాలకొల్లు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద ఉన్న జాతీయ నేతల విగ్రహాలకు ఉదయం 10 గంటల వరకు వివిధ పార్టీల నేతలు పూలమాల వేయకపోవడంతో పాలకొల్లు సర్కిల్‌ పోలీస్‌ శాఖ వెంటనే స్పందించింది. పట్టణ సిఐ సిహెచ్‌.ఆంజనేయులు, రూరల్‌ సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావుల సారధ్యంలో పట్టణ ఎస్‌ఐ రెహమాన్‌, పోలీసులు సహృదయంతో స్పందించి నేతల విగ్రహాలకు యుద్ధ ప్రాతిపదికన పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలు సైతం వదిలిన నేతలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్మరించుకోవడం, వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరుగుతుంది. కానీ పాలకొల్లులో ఉదయం పది గంటలు దాటినా నాయకులు గానీ, అధికారులు గానీ వచ్చి విగ్రహాలకు పూలమాలలు వేయలేదు. దీంతో సహృదయంతో స్పందించిన పోలీస్‌ అధికారులు నేతల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.