ప్రజాశక్తి-రాజంపేటఅర్బన్ (అన్నమయ్యజిల్లా) : ఉత్తమ పంచాయతీ కార్యదర్శిగా ఉట్కూరు గ్రామపంచాయతీ కార్యదర్శి జె.బాల కుమార్.. ఎమ్మెల్యే మేడా వెంకట మల్లిఖార్జున రెడ్డి, ఆర్డిఓ రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఆర్డీవో కార్యాలయంలో ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా బాల కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన సేవలను గుర్తించి తనకు పురస్కారం అందజేయడం ఆనందదాయకమని తెలిపారు. భవిష్యత్తులో మరింత బాధ్యతాయుతంగా ప్రజలకు చేరువై గ్రామ సమస్యలు పరిష్కరిస్తూ మరింత సేవ చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు.










