Jul 19,2023 21:14
  • మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌ ఎదుట ప్రదర్శనలు

జెరూసలేం : ఇజ్రాయిల్‌ న్యాయ వ్యవస్థపై ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు ప్రభుత్వం చేస్తును దాడినినిరసిస్తూ ప్రజలు నిరసలనకు దిగారు. రహదారులను దిగ్బంధించారు, రైళ్లను నిలిపివేశారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌, మిలటరీ హెడ్‌క్వార్టర్స్‌ల ఎదుట పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు, ధరాులు నిర్వహించారు. మిలటరీ రిజర్విస్ట్‌లతో సహా ఆందోళనకారులు మానవ హారాలను ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ టెల్‌ అవీవ్‌లోని ఇజ్రాయిల్‌ మిలటరీ హెచ్‌కార్వర్టర్‌ ప్రవేశ మార్గానిు దిగ్బంధించారు. స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ భవనం వెలుపల స్మోక్‌ బాంబులను విసిరిన ఆందోళనకారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నియంతృత్వంతో ఆర్థిక వ్యవస్థ హత్య చేయబడుతుంది, దేశానిు కాపాడాలంటూ వారు నినదించారు. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లనీు ఆందోళనకారులతో పోటెత్తాయి. దాంతో టెల్‌ అవీవ్‌లోనిసెంట్రల్‌ స్టేషన్‌లోకి వందలాదిగా ఆందోళనకారులు ప్రవేశించకుండా పోలీసులు స్టేషన్‌ను మూసివేశారు.
కాగా, సార్వత్రిక సమ్మెకు పిలుపివ్వాలని దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘమైన హిస్టాడ్రాట్‌ భావిస్తోంది. మార్చిలో ఇదే అంశంపై యూనియన్‌ సమ్మెకుపిలుపిచ్చింది. దాంతో నెతన్యాహు న్యాయ వ్యవస్థలో తాను తీసుకురాదలచిన చర్యలను నిలుపుచేయాల్సి వచ్చింది. అయితే ప్రతిపక్షంతో జరిగిన చర్చలు విఫలమవడంతో గత నెల్లో తిరిగి ఈ సంస్కరణల ఆలోచన తలెత్తింది. వచ్చే వారంలో ఈ ప్రణాళిపై ఓటింగ్‌ జరగనుంది. దానికి ముందుగా ఈ బిల్లును బుధవారం పార్లమెంటరీ కమిటీకి పంపారు. న్యాయమూర్తుల నియామకంపై రాజకీయ నేతలకు మరింత నియంత్రణ ఇవ్వడానికి ప్రతిపాదిత బిల్లు తెచ్చారు. అవసరమైతే కోర్టు నిర్ణయాలను తిప్పికొట్టడానికి పార్లమెంట్‌కు అధికారం వుండాలనుది ప్రభుత్వ ఆలోచనగా వుంది.