జెరూసలెం : గాజాస్ట్రిప్‌లో హమాస్‌తో కాల్పుల ఉల్లంఘన ప్రసక్తే లేదని ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పేర్కొన్నారు. సోమవారం విదేశీ మీడియాతో ఆయన మాట్లాడారు. కాల్పుల విరమణ అంటే హమాస్‌కు ఇజ్రాయిల్ లంగిపోవడమేనని అన్నారు. '' కాల్పుల విరమణకు పిలుపు నివ్వడమంటే ఇజ్రాయిల్ హమాస్‌కు లంగిపోవడమే. ఉగ్రవాదానికి తలవంచడమే. ఇది ఎప్పటికీ జరగదు. హమాస్‌పై గెలిచేవంత వరకు ఇజ్రాయిల్ యుద్ధాన్ని కొనసాగిస్తుంది '' అని స్పష్టం చేశారు.
యుద్ధం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటివరకు 8,309 మంది పాలస్తీనియన్లు మరణించగా, వారిలో మూడు వేలమందికి పైగా చిన్నారులు మరణించారని యుఎన్ మానవతా కార్యాలయం (ఒసిహెచ్ఎ) ఆందోళన వ్యక్తం చేసింది. సుమారు 2,062 మంది మహిళలు ఉన్నారని తెలిపింది. పెద్ద ఎత్తున మానవతా సాయం అందించాల్సి వుందని పేర్కొంది. తక్షణ మానవతా కాల్పుల విరమణ లక్షలాది మంది జీవన్మరణసమస్యగా మారిందని యుఎన్కి చెందిన పాలస్తీనా శరణార్థుల చీఫ్ సోమవారం ఐరాస అత్యవసర సమావేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా సమిష్టి శిక్ష మాత్రమే కాకుండా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని పేర్కొంది. ఈ యుద్ధం సిరియాలోకి చొచ్చుకెళుతోందని యుఎన్ రాయబారి హెచ్చరించారు.
ఇజ్రాయిల్ నుండి దక్షిణ గాజాకు పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా 'ప్రకటించని కారణాలతో' సోమవారం నిలిపివేయబడిందని ఒసిహెచ్ఎ ఓ ప్రకటనలో తెలిపింది. సెంట్రల్ గాజాకు నీరు సరఫరా చేసే మరో పైప్‌లైన్ మరమ్మత్తు జరగలేదని వెల్లడించింది.