Nov 09,2023 11:32

గాజా సిటీ :   ఉత్తర గాజా నుండి పారిపోతున్న పాలస్తీనియన్ల సంఖ్య పెరుగుతున్నట్లు ఐరాస బుధవారం పేర్కొంది. ఇజ్రాయిల్‌ వైమానిక, భద్రతాదళాలు గాజాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తర గాజా నుండి మంగళవారం 15,000 మంది పారిపోయినట్లు తెలిపింది. సోమవారం 5,000, ఆదివారం 2,000తో పోలిస్తే ఆ ప్రాంతాన్ని విడిచిపెడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఐరాసకు చెందిన మానవతా వ్యవహారాల కోఆర్డినేషన్‌ వెల్లడించింది.   గాజా సిటీలోని ఇజ్రాయిల్‌ దళాలు హమాస్‌ స్థావరాలు లక్ష్యంగా దాడి చేస్తున్నట్లు ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడిఎఫ్‌) తెలిపింది. హమాస్‌ మౌలిక సదుపాయాలపై, టన్నెల్స్‌పై దాడికి దిగినట్లు తెలిపాయి.   ఇజ్రాయిల్ అమానవీయ దాడుల్లో   ఇప్పటి వరకు 10,500కు పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా వైద్య శాఖ తెలిపింది. మృతుల్లో 4,500 మంది చిన్నారులు  ఉన్నట్లు  ప్రకటించింది.