- భూతల దాడులకు సిద్ధమవుతున్న ఇజ్రాయిల్
- 1,055కు పెరిగిన పాలస్తీనా మృతుల సంఖ్య
- ఆరోగ్య విపత్తు తలెత్తే ప్రమాదముంది: అంతర్జాతీయ సంస్థల హెచ్చరిక
గాజా : అమెరికా, ఇతర పశ్చిమ దేశాల అండ చూసుకుని ఇజ్రాయిల్ అంతకంతకూ రెచ్చిపోతోంది. గాజా దిగ్బంధనంలో భాగంగా అక్కడి ఏకైక విద్యుదుత్పత్తి కేంద్రాన్ని షట్‌డౌన్ చేసింది. వైమానిక దాడులను ఉధృతం చేసిన నెతన్యాహు ప్రభుత్వం ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతోంది. గాజాలో రెండు వారాలకు సరిపడా ఆహారం, ఇంధనం మాత్రమే ఉన్నాయని పాలస్తీనా అది óకారులు చెప్పారు. శనివారం నుంచి ఇజ్రాయిల్ సాగిస్తున్న ఉగ్ర దాడుల్లో ఇంతవరకు 1,055 మంది పాలస్తీనీయులు చనిపో యారు. మరో 5వేల మందికిపైగా గాయపడ్డారు. హమాస్ సాయు ధ పోరాట గ్రూపు జరిపిన ప్రతిఘటనా దాడుల్లో 1200 మంది ఇజ్రాయిల్‌లో చనిపోయినట్లు ఇజ్రాయిలీ ఆర్మీ తెలిపింది. ఇజ్రాయి ల్ బలగాలు బుధవారం 1500 మంది హమాస్ మిలిటెంట్లను చంపినట్లు ఆ దేశ ఆర్మీ తెలిపింది. గాజాలో 3000 నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్ వై మానిక దాడులు జరిపింది. 1,80,000 మంది స్కూళ్లలో తలదాచుకుంటున్నారు. గాజా చుట్టు పక్కల ప్రాంతాలను తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు ఇజ్రాయిల్ తెలిపింది.
- దురాక్రమణదారు ఎవరు?
ఇజ్రాయిల్, హమాస్ దాడులు, ప్రతి దాడుల్లో హమాస్‌ను ఉగ్రవాద సంస్థగాను, ఇజ్రాయిల్‌ను ఉగ్రవాద బాధితురాలిగాను అమెరికా, యూరప్ ఇతర పశ్చిమ దేశాలు చిత్రించడం పట్ల సర్వత్రా విమర్శలొస్తున్నాయి. ఇజ్రాయిల్ ఓ దురాక్రమణ దారు అని, అది అంచెలంచెలుగా పాలస్తీనా భూ భాగాలను కబళించి, పాలస్తీనీయులను ఇళ్లనుంచి తరిమేసి, వారి కదలికలను అడ్డుకుంటున్నదని అరబ్ దేశాలు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలిలో తీర్మానం వచ్చినప్పుడల్లా అమెరికా దానిని వీటో చేస్తూ వచ్చిందని , పశ్చిమ దేశాల అండతోనే ఇజ్రాయిల్ ఇలా పేట్రేగిపోతోందని ఇరాన్ పేర్కొంది.