Jun 09,2023 18:02

వాషింగ్టన్‌  :  మెటా సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం కొంతసేపు సేవలు నిలిచిపోయినట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. డౌన్‌డిటెక్టర్‌ సమాచారం ప్రకారం.. 44 శాతం మంది వినియోగదారులు యాప్‌తో సమస్యను ఎదుర్కొనగా, 32 శాతం మంది వెబ్‌ వెర్షన్‌లో, 24 శాతం మంది సర్వర్‌ కనెక్షన్‌లో సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో మీమ్స్‌, గిఫ్‌లతో పాటు వినియోగదారులు ఎదుర్కొన్న ఇతర సమస్యలను వాట్సప్‌లో షేరు చేసుకున్నారు. మరోసారి ఇన్‌స్టాగ్రామ్‌ నిలిచిపోయిందని.. వీడియో, మ్యూజిక్‌ లోడ్‌ కావడం లేదని ఓ యూజర్‌ పేర్కొనగా, తన ఖాతా హ్యాక్‌ గురైందంటూ మరో యూజర్‌ రిప్లై ఇచ్చారు.   గత నెలలో కూడా ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ గంటపాటు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.