
చెన్నై : ఈశాన్య రుతుపవనాలు వచ్చేసాయని ఐఎండి(భారత వాతావరణ శాఖ) ప్రకటించింది. ఇవి తమిళనాడు మరియు పుదుచ్చేరిలో శనివారం ప్రారంభమైనట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బంగాళాఖాతంలోని బలమైన ఈశాన్య గాలులు, ఆగ్నేయ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడం బట్టి రుతుపవనాలు ఆగమనాన్ని ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫానును 'తేజ్' గా నామకరణం చేశారు. ఈ తుఫాను ఆదివారం నాటికి తీవ్ర తుపానుగా మారి యెమెన్-ఒమన్ తీరాల వైపు వెళ్లి అక్టోబర్ 25 నాటికి తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. అయితే ఈ ఋతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండకపోవచ్చునని తెలుస్తోంది.