Oct 05,2023 09:51
  • అడ్డుకున్న మహిళలు
  • ఈడ్చిపారేసిన పోలీసులు
  • సిపిఎం నాయకులు అరెస్టు వేరు వేరు పోలీస్ స్టేషన్ ల కు తరలింపు...

ప్రజాశక్తి-చిలమత్తూరు : ఇంటి పట్టాలు ఇస్తామని నమ్మించారు... తీరా ఇళ్ళ నుండి గెంటేసి, ఉన్న గుడెసెలను కూల్చేశారు... అంటూ అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు గ్రామం రెవెన్యూ పొలం సర్వే నెంబర్ - 805లో నివసిస్తున్న పేదలు విలపించారు. గుడిసెలు వేసుకున్న చోటే ఇంటి పట్టాలు ఇస్తామని నమ్మించారని, తహశీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న పేదలకి హామీ ఇచ్చారని వారు తెలిపారు. శాంతియుతంగా ఉండమని, ఇంటి పట్టాలు ఇస్తామని చెప్పిన అధికారులను నిజం అని పేదలు నమ్మారు. మీరు పట్టాలు ఇచ్చేవరుకు మేము గుడిసెలలో ఉంటామంటే అలాగే అన్నారు‌. నమ్మి గుడిసెల్లో ఉంటున్న పేదలపై ఒక్కసారిగా గురువారం ఉదయం 100 మంది పోలీసులతో దాడి చేశారు. మహిళలని చూడకుండా ఈడ్చి పడేశారు. భారీ తోపులట నడుమ సిపిఎం నాయకులను, మహిళలను అరెస్టు చేసి లేపాక్షి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఒక్కసారిగా గుడిసెలను జేసిబీలతో మట్టం చేశారు‌. గుడిసెలలో పేదలకు సంబందించిన మంచాలు, వస్తువులు చిందరా బందరా చేశారు‌. 'సార్ మాకు నీడ లేదు.. ఉన్న గుడిసెను పీకేయడం సరికాద‌'ని ప్రాధేయపడ్డారు. ఇంటి పట్టాలు ఇస్తామన్నా మీరే గుడిసెలు పీకేయడం సరికాదని అన్నారు. అయిన కాకీలు కరగలేదు. తహశీల్దార్ కనికరించలేదు. మీకు పేదలపై అక్కసు ఎందుకు అని సిపిఎం నాయకులు నిలదీశారు. శాంతియుత ఉధ్యమంపై ఇందుకు ఇంతగా ఇరుచుకుపడుతున్నారని ప్రశ్నించారు. పెద్ద పెద్ద భూస్వాములకు సేవ చేస్తూ పేదల కడుపు కొడుతున్న తహశీల్దార్ ని సస్పెండ్ చేయాలన్నారు. సెంటిన్నర భూమి కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఓ ప్రభుత్వమేనా అన్నారు‌. ఈ నిరుకుశత్వ వైఖరితో ఎన్నో రోజులు పరిపాలన చేయలేదని హెచ్చరించారు. స్థానిక వైసిపి నాయకులు 805 సర్వే నెంబర్ భూమిని కబ్జాచేయాలన్న ఉద్దేశ్యంతోనే ఇంత బలగాన్ని రంగంలోకి దింపారని అన్నారు‌. ప్రశ్నించేవారిని పేదల మద్దతుగా నిలిచేవారిపై అక్రమంగా కేసులు పెట్టడం,అరెస్టు చేయడం ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అన్నారు. ఆ పేదలే మీకు ఓట్లు వేయాలన్నాది తెలుసుకోవాలన్నారు‌. ప్రజా వ్యతిరేఖ విధానాలను అవలంబిస్తూ ఇలాంటి చర్యలు చేపట్టడం దారుణం అన్నారు. అరెస్టు ల సందర్బంగా గుడిసెలలో ఏర్పాటు చేసుకున్న గాంధీ పోటోను లాగి పడేశారు. తోపులటాలో మహిళలకు రక్తగాయాలు అయ్యాయి. పేద మహిళలను, నాయకులను వాహనాలకు వేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అరెస్టు అయిన వారిలో సిపిఎం మండల కార్యదర్శి వెంకటేష్,అధ్యక్షుడు లక్ష్మినారాయణ, సిఐటీయు జిల్లా నాయకులు రమేష్,కమిటి సభ్యులు శివ, రహంతుల్లా, చరణ్, నరసింహా, సదాశివరెడ్డి, రాజు, మంజు తదితరులు పాల్గొన్నారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ తహశీల్దార్ కార్యాలయం వద్ద పేదలు ఆందోళన  చేపట్టారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్, జీఎల్ నరసింహులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 

house-collapse-in-anantapuram-women

 

house-collapse-in-anantapuram-women

 

house-collapse-in-anantapuram-women

 

house-collapse-in-anantapuram-arrest-cpm