Oct 04,2023 16:21
  • జట్టుకు 16 మంది ఎంపిక

ప్రజాశక్తి ...విజయనగరం టౌన్ : అండర్ 19 జిల్లా హ్యాండ్ బాల్ జట్లు ఎంపిక పోటీలకు విశేష స్పందన లభించింది.జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్య లో బాల, బాలికలు హాజరు కావడం జరిగింది. బాలురు జట్టు కు 16 మందిని, బాలికలు జట్టుకు 16 మంది తో ఎంపిక చేయడం జరిగిందని అండర్ 19 స్కూల్ గేమ్స్ కార్యదర్శి కృష్ణ తెలిపారు.జిల్లా కు ఎంపికైన జట్లు ఈ నెల 29 నుంచి కర్నూల్ జిల్లాలో జరిగే రాష్ట్ర పోటీల్లో పాల్గొంటాయి అని తెలిపారు. ఎంపిక పోటీలలో హ్యాండ్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి మల్లేశ్వరరావు,వ్యాయమ ఉపాద్యాయులు పాల్గొన్నారు.