
- యూనియన్ జిల్లా బాధ్యులు బి. సుధారాణి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 5 న ఆదివారం ఉదయం 10 గంటలకు ఎన్ పి ఆర్ శ్రామిక భవన్, సిఐటియు కార్యాలయం నందు జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి , యూనియన్ బాధ్యులు బి. సుధారాణి , సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు ఏ. జగన్మోహన్, బి. రమణలు శనివారం స్థానిక ఎల్బీజీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫుల్ టైం పని చేయించుకుని స్కూల్ శానిటేషన్ వర్కర్లకు పార్ట్ టైం వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ ఆయాలకు కనీసం 10000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పిఎఫ్ , వీక్లీ ఆఫ్ తదితర సౌకర్యాలు కల్పించాలని, ప్రతినెల జీతాలు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, యూనిఫాం, మాస్కులు, గ్లౌజులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలపై నవంబర్ 5 న జరిగే జిల్లా సదస్సులో శానిటేషన్ కార్మికులందరూ పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో స్కూల్ ఆయాలు సత్తమ్మ, లక్ష్మి, అంజలి, లతా, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.