
ప్రజాశక్తి-బి.కొత్తకోట: బి.కొత్తకోట పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా విగేష్ మిత్రమండలి సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధ వినాయకుడు విగ్రహం పట్టణంలోని పలువురిని ఆకర్షిస్తుంది. గతేడాది నిర్వహించిన కొబ్బరికాయలోని వినాయకుడు విగ్రహానికి విశేష స్పందన రావడంతో ఈ ఏడాది బుద్ధ వినాయకుడు ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, అందుకోసమే ప్రజలను ఆకర్షించేలా వినాయకుని ఏర్పాటు చేశామని విగ్రహ నిర్వాహకులు చెబుతున్నారు. విగేష్ మిత్రమా సభ్యులు.టి.ప్రవీణ్ కుమార్, కేదార్ నాథ్, ఆవుల శ్రీనివాసులు, రమేష్ నాయుడు, టి.ప్రకాష్ రావు, వి.మణికంఠ చారి, సుధాకర్, దాదాపీర్, క్రాంతికుమార్, శివ, తదితరులు పాల్గొన్నారు.