Oct 02,2023 12:25
  • ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభు

ప్రజాశక్తి-విజయనగరం కోట : రాష్ట్రంలో ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం నడుస్తుందని టిడిపి పోలిట్బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు.సోమవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురష్కరించుకుని స్థానిక అశోక్ బంగ్లా టిడిపి కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు . ఈసందర్భంగా తనను అక్రమంగా అరెస్ట్ చేసారని నిరసిస్తూ రాజమండ్రి కేంద్ర కారాగారంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు  గాంధీ జయంతి సందర్బంగా ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు, అదేవిధంగా నారా భువనేశ్వరి  రాజమహేంద్రవరంలో "సత్యమేవ జయతే దీక్ష" చేయనున్నారు.  ఈ సందర్బంగా మా నాయకులకు మద్దతుగా ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో మహిళలు  పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు.   విజయనగరం పట్టణంలో మూడు లాంతర్లు జంక్షన్, రింగ్ రోడ్డు జంక్షన్, కనుకపరమేశ్వరి కోవెల జంక్షన్, మహిళా ప్రాంగణం, కలెక్టర్ వారి కార్యాలయం, గాంధీ పార్క్, కస్పా హై స్కూల్, ప్రేమ సమాజం, వి.టి.  అగ్రహారం మొదలగు ప్రాంతాలలో గల మహాత్మా గాంధీ  విగ్రహాలకు స్థానిక  తెలుగుదేశం పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పార్టీ కార్యాలయంలో  పూసపాటి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ స్వతంత్ర దేశంలో బాపూజీ మహాత్మా గాంధీ జన్మదినం అందరు సంతోషించవలసిన రోజు అన్నారు. స్వతంత్ర సమరయోధులు మనకు స్వాతంత్య్రాన్ని తీసుకువచ్చారు, తరువాత పెద్దలు  మన దేశానికి  రాజ్యాంగాన్ని రచించారు,  చట్టాలు చేస్తారన్నారు. దురదృష్టవశాత్తు ప్రజాస్వామ్యంతో సంబంధం లేని ప్రభుత్వం రాష్ట్రంలో రావడంతో మా నాయుడుని కారణం లేకుండా అరెస్ట్ చేసారని అన్నారు,  మెజిస్ట్రేట్ మీరు నేరస్థుడు కాదు, మీరు శిక్ష అనుభవిస్తున్నారు అనికోవద్దు అంటున్నారు,  ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండదా అని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టాలు అమలు కావాలి, దౌర్జన్యాలు నశించాలన్నారు. ఇంకా నేరం ఏంటో వెతుకుతాఉన్నారంట. రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత ఉంది, కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉంది.  తెలుగువాళ్లు కూడా భారతదేశంలోనే భాగమే అని అన్నారు.  మంత్రులు రాళ్లు విసురుతారు, చొక్కాలు విప్పుతారు, బూతులు మాట్లాడుతారు వారిపై ఒక కేసు కూడా ఉండదు, శాంతియుతంగా ప్రశ్నించే వారిపై  కేసులు పెడుతున్నారన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేసారు. 20 రోజులు అయింది చంద్రబాబు ని జైలులో నిర్బంధించి, ఇంతవరకు నేరం ఏంటో చెప్పడం లేదు, ఇలా అయితే ఎవరినయినా జైలులో  పెట్టొయొచ్చు, పెట్టేసి మేము నేరం వెతుకుతామని చెప్పడం చూస్తుంటే  అంతకన్నా సిగ్గుచేటు ఉండదు అని మండిపడ్డారు. 
కేంద్రం ప్రభుత్వం తన బాధ్యతను నిర్వహిస్తే ఈ విషయం 5 నిమిషాల్లో పరిష్కారం అవుతాది అని అన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం అమలు చేసేలా మీ ధర్మం మీరు పాటించడండి, లేకపోతే మీ ప్రమోషన్ లు ఆగిపోతాయని కేంద్రం ప్రభుత్వం అంటే ఇలాంటి విషయాలు 5 నిమిషాల్లో ఆగిపోతాయని, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదో మనకి అర్ధం కాదని అన్నారు.  మీ రాజ ధర్మాన్ని నిలబెట్టండని సూచించారు. గుడికి వెళ్తే అడ్డు, బడికి వెళ్తే అడ్డు.. ఇలా ప్రజలపై పడడం అన్యాయం, దానికి నిరసనగా ప్రజాస్వామిక పద్దతిలోనే మా నిరసన చెప్తున్నాము.  రోజు రోజు కు పరిస్థితులు శృతిమించిపోతున్నాయి.   అనుమతులు లా అండ్ ఆర్డర్ ని  మెయింటేన్ చేయడానికి  కాని, మంత్రులు రాళ్లు విసరడానికి,  చొక్కాలు విప్పడానికి కాదని విషయం తెలుసుకోవాలని, ఆ మాత్రం కూడా అధికారులు గ్రహించలేకపోతే వారు స్వాతంత్య్రానికి అనర్హులవుతారని అన్నారు. మన భావితరాలకు స్వతంత్ర భారతదేశాన్ని అప్పగించే బాధ్యత పెద్దలపై ఉంది. మా  నాయుడుని వెంటనే విడుదల జేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రాధమిక హక్కులు ఉన్నాయా, లేవా అని ప్రశ్నించారు.  ఇలాంటి పనులు చేయడం వలెనే సైకో అని బిరుదు వచ్చిందన్నారు, ఇప్పటికైనా మంచి బుద్ధి రావాలని ఆ భగవంతుడుని ప్రార్ధిస్తున్నామన్నారు, స్వాతంత్య్రాన్ని కాపాడే బాధ్యత ప్రతి పౌరిడిది అని అన్నారు.ఈకారిక్రమంలో విజయనగరం నియోజకవర్గ టిడిపి నాయకులు,మహిళలు పాల్గొన్నారు.