- రెండో స్థానంలో నిలిచిన పంజాబ్
- మూడో ర్యాంకుకు పడిపోయిన తమిళనాడు
న్యూఢిల్లీ : ఆహార భద్రత సూచీ 2022-23లో కేరళ చక్కని ప్రదర్శనను కనబర్చింది. దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో నిలిచింది. పంజాబ్ రెండో స్థానంలో ఉన్నది. కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం విడుదల చేసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఐదో ఆహార భద్రత సూచిక (ఎస్‌ఎఫ్‌ఎస్‌ఐ)లో ఆయా రాష్ట్రాల ర్యాంకులు వెలువడ్డాయి.
ఆహార భద్రత సూచిక సమాచారం ప్రకారం.. దేశంలోని 20 పెద్ద రాష్ట్రాల్లో తమిళనాడు అగ్రస్థానంలో ఉనుది. గుజరాత్, మహారాష్ట్రలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ విషయంలో 2020ా21లో గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా ఈ సారి దాని ర్యాంకు పడిపోవటం గమనార్హం. ఇక చిన్న రాష్ట్రాల విషయానికి వస్తే గోవా వరుసగా నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మణిపూర్, సిక్కిం రాష్ట్రాలు ఉనాుయి. గతేడాది కూడా ఈ మూడు రాష్ట్రాలు అవే స్థానాల్లో ఉనాుయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో జమ్మూకాశ్మీర్, ఢిల్లీ, చండీగఢ్‌లు వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. గతేడాది కూడా ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఇవే స్థానాలలో ఉండటం గమనార్హం.
జిల్లాల కోసం ఉద్దేశించిన ఈట్ రైట్ ఛాలెంజ్‌ాఫేజ్ 2 విజేతలను కూడా కేంద్ర మంత్రి సత్కరించారు. ఇందులో అనేక జిల్లాలు తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, యూపీ, మహారాష్ట్రల నుంచి ఉనాుయి. ఇవి అసాధారణ ఫలితాలను సాధించాయి. పాల్గను 260 జిల్లాలలో 31 విజయవంతంగా 75 శాతం లేదాఅంతకంటే ఎక్కువ స్కోర్‌ను సాధించాయి.
ఆహార భద్రత సూచిక ఆహార భద్రతకుసంబంధించిన వివిధ అంశాలలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పనితీరును అంచనా వేస్తుంది. ఇందులో మానవ వనరులు, సంస్థాగత సమాచారం, సమ్మతి, ఆహార పరీక్ష సౌకర్యం, శిక్షణ, సామర్థ్యం పెంపుదల, వినియోగదారుల సాధికారత వంటివి ఉనాుయి.
- 34 శాతం జిల్లాల్లో ఇప్పటికీ మ్యాన్యువల్ స్కావెంజింగ్
మ్యాన్యువల్ స్కావెంజింగ్ నిర్మూలన విషయంలో మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటునుప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకుపూర్తి విరుద్ధంగా ఉనాుయి. దేశంలోనిచాలా జిల్లాల్లో మనుషులు చేతులతో మలమూత్ర విసర్జాలు, మురుగు కాలువలను శుభ్రం చేసే ఈ అమానవీయ విధానం ఇప్పటికీ కొనసాగుతునుది. సాక్షాత్తూ కేంద్ర సామాజిక న్యాయ, సాధితకారత మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక నివేదికే ఈ విషయానిు వెల్లడిస్తునుది.
ఈ నివేదిక ప్రకారం.. భారత్‌లో మ్యాన్యువల్ స్కావెంజింగ్ ఇప్పటికీ ఆందోళన కలిగిస్తునుది. దేశవ్యాప్తంగా మొత్తం 766 జిల్లాలకుగానూ 508 జిల్లాలు మ్యాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించుకునాుయి. అయితే, మ్యాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధినినిషేధించటం, పునరావాస చట్టం కింద ఈ పద్దతి నిషేధించబడినప్పటికీ భారత్‌లో ఇప్పటికీ దాదాపు 34 శాతం జిల్లాల్లో మ్యాన్యువల్ స్కావెంజింగ్ ప్రబలంగా ఉండటం గమనార్హం.
2017 నుంచి 2021 మధ్య దేశంలో మొత్తం 330 మంది మ్యాన్యువల్ స్కావెంజర్ల మరణాలు చోటు చేసుకునాుయి. మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేస్తును సమయంలో ఈ మరణాలు చోటు చేసుకునాుయి. ఈ మరణాలపై కరాుటక సఫాయి కర్మచారి కమిషన్ చైర్‌పర్సన్ ఎం. శివను కొటే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నాలుగేండ్లలో చనిపోయిన 330 మందినిఎందుకుమ్యాన్యువల్ స్కావెంజర్లుగా పరిగణించలేదనిప్రశిుంచారు. మ్యాన్యువల్ స్కావెంజింగ్‌కువ్యతిరేకంగా గత కొనేుండ్లుగా ఎనోు ఉద్యమాలు, పోరాటాలు కొనసాగుతునాుయి. అయినప్పటికీ ఈ అమానవీయ పద్దతినినిర్మూలించే విషయంలో మోడీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తుండటం ఆందోళనను కలిగిస్తునుదనిదేశవ్యాప్తంగా సఫాయి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తునాురు.










