Jun 23,2023 11:57
  • ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి

ప్రజాశక్తి-బి.కొత్తకోట(రాయచోటిi): గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు తంబళ్లపల్లి శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నియోజవర్గంలోని బి.కొత్తకోట మండలం, కోటవూర్ పంచాయతీ నందు బుద్దలవరిపల్లి, కొండ క్రాస్, గుండ్లగుట్టవరి పల్లి, బిల్లురి వారి పల్లి, అమర నారాయణాపురం, నాయనబండపల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎపి సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను సమర్ధవంతంగా అమలు చేయాలని, పేదలైన అర్హులందరికీ సకాలంలో అందాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను సులభంగా, వేగంగా పరిష్కరించడానికి గ్రామ సచివాలయాలు దోహదపడుతున్నాయన్నారు. ఇప్పటికే మండలంలో దాదాపు సిసి రోడ్లు, తాగునీటి ట్యాంకులు, మురుగనీటి కాలువల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. ఇంకా అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో శంకరయ్య, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,వైసిపి నాయకులు, సచివాలయ కన్వీనర్లు, సచివాలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.