Jul 26,2023 15:40

ప్రజాశక్తి - రాజంపేట రూరల్ : ఓబులవారిపల్లి మండలం వోరంపాడు గ్రామం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన మస్తే రుకాల ఉమర్ హమీద్ కి 2 లక్షల రూపాయలు, ఏనుగుల శంకరయ్యకి 2 రెండులక్షల రూపాయలు ప్రభుత్వం నుండి మంజూరైన నగదు యొక్క చెక్కును శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి  వారి కుటుంబ సభ్యులకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలోఅందజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట తహసిల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి, వైయస్సార్సీపి రాష్ట్ర నాయకులు మందరం వేణుగోపాల్ రెడ్డి, ఆనం నాగేంద్ర, ఖాజా మొహుద్దీన్, మురళి ఆచారి, భీమరాజు, మరియు తదితరులు పాల్గొన్నారు.