- జీఓ 117 వలన ప్రభుత్వ విద్యా సంస్థలకు మంగళం
- ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపడుకోడం కోసం ఐక్య ఉద్యమం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని, జీఓ 117 వలన ప్రభుత్వ పాఠశాలలు మూత పడనున్నయని వాటిని కాపాడుకోవడం కోసం ఐక్యంగా ఉద్యమించాలని ప్యాప్టోరాష్ట్ర చైర్మన్ ఎన్.వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ప్యాప్టో జిల్లా చైర్మన్ మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన విద్యా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జీవో నెంబర్ 117 వల్ల రాష్ట్రంలో వేల సంఖ్యలో పాఠశాలలు మూసివేసే పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడిన ఉన్నదన్నారు. పాఠశాలలు మూత పడటంతో పాటు ఎస్జిటి పోస్టులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని కాబట్టి ఈ జీవో రద్దు చేయాలని ఆయన సదస్సు ద్వారా డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతరపనులు మినహాయింపు ఇవ్వాలన్నారు. బొదేనేతర పనులు కారణంగా పాఠ్యాంశాలు బోధనకు ఆటంకంగా ఉందన్నారు. గతంలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బోదేనేతర పనులు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు కానీ అమలు చేయలేదన్నారు.తక్షణమే బొదేనేతర పనులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రెగ్యులర్ ఉద్యోగాలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. 12వ పిఆర్సి కమిషన్ కు చట్టబద్ధత కల్పించాలని సదస్సు ద్వారా కోరారు. గతంలో 11వ పిఆర్సిలో చట్టబద్ధత లేకపోవడం వల్ల ప్రభుత్వం ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకుందని ఎద్దేవ చేశారు. అటువంటి ఇబ్బందులు లేకుండా 12వ పి అర్ సి కి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పాఠశాలలకు పర్యటనకు వెళుతూ ఏ చిన్న తప్పుకు కూడా ఉపాధ్యాయులను,విద్యా శాఖాధికారులకు సిక్షించడమే పనిగా పర్యటనలు చేయడం సరికాదన్నారు. ఆయన వైఖరి కారణంగా ఉపాద్యాయులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని అటువంటి వేధింపులకు పాల్పడే చర్యలు మానుకోవాలన్నారు. ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం కోసం, విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపాద్యాయులు ఐక్య ఉద్యమాలకు సిద్దం కావాలని, ప్రజలని, ప్రజా సంఘాలను కలుపుకొని పోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉత్తరాంధ్ర ఉపాద్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఇచే పెన్షన్ విషయంలో జి పీ ఎస్ పేరుతో మరలా మోసం చేయాలని చూస్తుందని అన్నారు. వెంటనే సి.పి.యెస్.రద్దు చేసి పాత పెన్షన్ యధాతధంగా అమలు చేయాలన్నారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేసేజి.ఓ నెంబర్ 117 తక్షణమే రద్దు చెయ్యాలన్నారు. విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాశ్ వైఖరి మార్చుకోవాలన్నారు. సదస్సులో అనంతరం భాగస్వామ్య సంఘాల రాష్ట్ర నాయకులు భానుమూర్తి గారు(ఎపి టి ఎఫ్ 257),గణపతి గారు(ఆప్టా), సదాశివరావు(ఏపిటి ఎఫ్ 1938), జోగారావు (ఎస్ టి యు), డి.రాము(యుటిఎఫ్) జిల్లా ప్యాప్తో సెక్రటరీ జనరల్ వేంకట రమణ, డిప్యూటీ సెక్రటరీలు రమేశ్ చంద్ర పట్నాయక్, డి.శ్యామ్, కార్యవర్గ సభ్యులు డి.ఈశ్వరరావు, కె.సన్యాసినాయుడు, వై.అప్పారావు, జె.ఏ వి.అర్ కె.ఈశ్వరరావు అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొన్నారు.










