
- కవిత అగ్రిపామ్ లో అడుగడుగునా ఆక్రమాలే : సిపిఎం
ప్రజాశక్తి-దేవరాపల్లి : సిపిఎంపై కవిత అగ్రిపామ్ యాజమాన్యం చేసిన ఆరోపనులన్ని అవస్థావాలేనని ఈభూములు కోనుగోల్లులో అన్ని ఆక్రమాలే జరిగాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న స్పష్టం చేశారు. గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఎర్పాటు చేసిన వీలేకర్లు సమావేశంలో అయిన మాట్లాడారు. కవిత అగ్రిపామ్ యాజమాన్యం డివి అప్పారావు చేసిన ఆరోపణలు అన్ని శుద్ద తప్పులెనని ప్రజలను దప్పుత్రోవ పట్టెంచె విదంగా పత్రికలకు విడుదల చేసారని తెలిపారు. డివి అప్పారావుపై సిపిఎం ఇప్పటి వరకు ఎప్పుడు వ్యక్తి గత దూసనులు ప్రచారం చేయలెదన్నారు. వ్యక్తి గత దూసనులు వలన సిపిఎంకు ఎటువంటి లాభం ఉండదన్నారు. ఈభూములు దేవదాయశాఖ అధికారులు స్వాధీనం చేసుకుంటే అది ప్రభుత్వానికి దేవదాయశాఖ కు ఉపయాగ పడుతుందని సిపిఎం కు ఎటువంటి ప్రయోజనం ఉండదని డి వి అప్పారావు గుర్తుంచుకోవాలి. వెంకన్న హితవు పలికారు సామాజిక స్పూరహతో సిపిఎం పార్టీ ప్రభుత్వ భూములు రక్షణ కోసం పోరాటం చేస్తుందని తెలిపారు,
మారేపల్లి రెవెన్యూ సర్వే నెంబరు 115 లో కోట్లాది రూపాయలు విలువ చేసె 23 ఎకారాల 15 సేంట్లు భూమి ముమ్మాటికీ దేవుని మాన్యా మేనని పక్కాగా రికార్డులు ఉన్నాయని తెలిపారు. 10.1 లో ఈభూమి సెటిల్ మెంట్ కు పూర్వం మారేపల్లి గ్రామానికి చేందిన ఆవుగడ్డ సఖూరినాయుడు ధర్మకర్తగా ఉన్నారని తెలిపారు. 1956లో భూమి సేటిల్ మేంట్ అయిన తరువాత మారేపల్లి శ్రీ రాములు వారి పేరున నమోదు అయ్యి ఉందన్నారు దిన్ని తారువా గ్రామానికి చేంది అల్లు గౌరునాయుడు కుటింబిలకు ఎవిదంగా దఖలు పడిందని వెంకన్న ప్రశ్నించారు శిస్తులకు దున్నుకున్న వ్యక్తులు కాలక్రమేణా 1999 లో విశాఖపట్నం మున్సిపల్ సివిల్ జడ్జి కోర్టులో కేసు వేయగా ఇండో మెంటుకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు దీన్ని అక్రమణ దార్లు రాజకీయ పలుకుబడి తో తోక్కి పెట్టి తప్పడు రికార్డులు స్రుంచించి అమ్మేసారని తెలిపారు, కోర్టుజడ్జిమెంటు 10, 1 సేటిల్ మెంటు పేయిర్ అడంగల్ కాపీలు ప్రకారం ఈభూములు దేవదాయశాఖకు చేందివేనని, 22 A1 C రికార్డుల్లో చేర్చి శ్రీ రాములు వారి పేరున పాస్ బుక్కులు ఇవ్వాలని దేవదాయశాఖ అధికారులు దేవరాపల్లి తహశీల్దార్ కు స్పస్టమైన ధరఖాస్తులు పెట్టారని తెలిపారు. దింతో పాటు విజయవాడ ఇండోమెంటు కమీషనర్ అదేశాలు మేరకు సింగిల్ ట్రస్టు ఇండోమెంటు ఇన్స్పెక్టర్ ను నియమించి వెంటనే ఈభూములకు బోర్డులు పెట్టాలని అనకాపల్లి అస్టేంటు కమీషనర్ ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
ఇన్ని ఆధారాలు ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టించడంకోసం ఇండోమెంటు భూములు అయితే మాకు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని డి వి అప్పారావు ప్రశ్నంచడంలో అర్దం లెదన్నారు దేవుని మాన్యంను అడ్డగోలుగా కోనుగోలు చేసింది కాక పురాతన మైన వెంకటేశ్వరస్వామి గుడి అబివృద్ది చేసానని వేదాంతం చెప్పడంలో అర్దం లెదన్నారు. ప్రభుత్వ భూముల్లో అడ్డగోలుగా రోడ్డు వేసెసి ఇది కేవలం దేవుని గుడికి మాత్రమే రోడ్డు వేస్తున్నానని డి వి అప్పారావు తహశీల్దార్ కు వ్రాసి ఇచ్చారని, లేఆవుట్ కు ఇప్పటికీ వరకు ఎందుకు రోడ్డు వేసు కోలెదని వెంకన్న ప్రశ్నించారు. ఆక్రమణ దారునికి ఎటువంటి అదికారులు ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు ట్రిబ్యునల్ కు వెళ్ళాలని,భూములు అమ్మిన వ్యక్తులు గాని కోనుగోలు చేసిన రీయల్ ఎస్టేట్ వ్యాపారికి గాని ఎటువంటి పాస్ బుక్కలు ఇవ్వరాదని స్పష్టం చేస్తు గతంలో ఉన్న అనకాపల్లి దేవదాశాఖ అస్టేంటు కమీషనర్ తేదీ 14/6/2022,న దేవరాపల్లి తహశీల్దార్ వారికి వ్రాయడం జరిగిందన్నారు. దీన్ని అదారంగా చేసుకోని తహశీల్దార్ రీయల్ ఎస్టేట్ వ్యాపారికి మూడుసార్లు పాస్ బుక్కులు తిరస్కరిస్తే ఇది ఎందుకు తిర్కరించారని డి వి అప్పారావు తహశీల్దార్ ను ఎందుకు ప్రశ్నించ లెదని డి వి అప్పారావును వెంకన్న సూటిగా ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ ఎండోమెంటు చట్టం లోని సెక్షన్ 81ప్రకారం ఎదైనా మతపరమైన స్థిరఅస్తి అమ్మకం, లేదా అక్రమణ చేల్లదన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టులో పుల్ బెంచ్ రిపరెన్స్ లో ఉదహరించిన తీర్పు లో దార్మిక మరియు మతపరమైన ఎండోమెంటు, యొక్క స్థిరమైన ఆస్తులు, సెక్షన్ 43 ప్రకారం, అక్రమణదారునికి హక్కులు ఉంటే ఎండోమెంటు యాజమాన్యం ను సవాల్ చేస్తు కోర్టుకు,వెళ్ళాలని అట్లు చేయని ఎడల అక్రమణదారునికి ఎటువంటి హక్కులు ఉండవన్నారు. ఎండోమెంటుపాత సెక్షన్ 38/25 రిజిస్టర్లు ప్రకారం కూడా ఓక్కసారి రెవెన్యూ సెటిల్ మెంట్ పేయిర్ అడంగల్,లో మతపరమైన హస్తిగా రికార్డుల్లో నమోదు అయితే అది ఎండోమెంటు భూమి క్రిందనే ఉంటుందని ఇకనైనా ప్రజలను తప్పుత్రోవ పట్టించె ప్రకటనలు మానుకోని స్వచ్ఛందంగా భూములు దేవదాయశాఖకు అప్పగించాలని వెంకన్న డిమాండ్ చేసారు.