Nov 17,2020 20:58

స్టాక్‌ వివరాలు తెలుసుకుంటున్న అధికారి


స్టాక్‌ వివరాలు తెలుసుకుంటున్న అధికారి
ఎరువుల దుకాణాల్లో తనిఖీ
ప్రజాశక్తి-డక్కిలి:మండలంలో వ్యవసాయ ఎరువుల దుకాణాలపై నాగార్జునసాగర్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు దుకాణాలలో ఎరువులు స్టాక్‌ వివరాలు పరిశీలించారు. దుకాణాల్లో ఉండే ఎరువులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. రైతులకు ఎరువులు అమ్మకాలు సాగించేటప్పుడు ఈపాస్‌ విధానాన్ని పూర్తిచేసి వేలిముద్రలు తీసుకోవాలన్నారు అనంతరం రైతు డిపో ను పూర్తిగా పరిశీలించారు దుకాణంలో ఉండే ఎరువులు రికార్డుల తగిన వివరాలను పరిశీలించారు. నాణ్యత కలిగిన ఎరువులను రైతులకు అమ్మకాలు సాగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పంటలకు తెగులు సోకినప్పుడు వాటిని పరిశీలించి వాటికి తగిన మందులను రైతులకు అమ్మకాలు సాగించాలన్నారు.
విత్తనాలు నాణ్యత పరిమాణం కలిగినటువంటి ఉత్తరాల మాత్రమే రైతులకు అమ్మాలన్నారు. పలు రికార్డులను పరిశీలించి తగు సూచనలు సలహాలు తెలిపారు. కార్యక్రమంలో అధికారిణి సుజాత, ఎంపిఇఒ రేఖ, తదితరులు పాల్గొన్నారు.