
మెటీరియల్‌ను అందుకున్న విద్యార్థులు
ఎన్‌ఎంఎంఎస్ మెటీరియల్ పంపిణీ
ప్రజాశక్తి-బుచ్చిరెడ్డిపాళెం
మండలంలోని దామరమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు ఎన్‌ఎంఎంఎస్ మెటీరియల్ పంపిణీ చేశారు. నేషనల్ మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ పరీక్షకు సిద్ధ పడుతున్న విద్యార్థులకు ఆంగ్ల ఉపాధ్యాయుడు పిజిడి కపాల్ ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ ఎన్‌ఎంఎంఎస్ పోటీ పరీక్షకు సిద్ధ పడుతున్న విద్యార్థులకు ఉచితంగా మెటీరియల్ అంద జేయడం సంతోషమన్నారు. ఇలా అనేక కార్యక్రమాలలో విద్యార్థులకు చేయూతనిస్తున్న ఆంగ్ల ఉపాధ్యాయుడు పిజిడి కపాల్ సేవలు కొన సాగించాలని కోరారు. కార్యక్రమంలో పేరెంట్ కమిటీ ఛైర్మన్ ఎస్ డి రషీద్, ఉపాధ్యాయులు నాగ జ్యోతి,బి. రమా దేవి,కామాక్షమ్మ, రవి పాల్గొన్నారు.